Gogikar Sai Krishna
Author- NTV Telugu-
TTD : టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలు నిషేధం
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించింది. ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం ఖరారు కాగా, ఇప్పుడు అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో మీడియాను ఉద్దేశించి రాజకీయ నేతలు రాజకీయ ప్రకటనలు చేయడం, తరచూ విమర్శలకు దిగడం వంటి ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొండ పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఇలాంటి […] -
Acid Attack : యువకుడిపై యువతి యాసిడ్‌తో దాడికి యత్నం
Acid Attack : ప్రేమోన్మాది ఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం, అయితే ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమతో సంబంధం లేకుండా, ఒక యువతీ యువకుడిపై యాసిడ్ దాడి చేసింది. తృటిలో తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరడంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. జయకృష్ణ అనే యువకుడు భీమవరంలో ఓ బట్టల దుకాణంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. విజయవాడకు చెందిన రేష్మ అనే […] -
Daggubati Purandeswari : పీడీఎస్ పై పవన్ కల్యాణ్ చర్యలు సరైనవే
Daggubati Purandeswari : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అంకితభావంతో పని చేస్తున్నారని తెలిపారు. 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తక్కువ సమయంలోనే 11 కోట్ల మంది సభ్యత్వం పొందారని, ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చగలిగినందుకు పార్టీ కార్యకర్తల కృషిని కొనియాడారు. కార్యకర్తల ప్రతిష్ఠాభిమానంతోనే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో పారదర్శకంగా, సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి […] -
Bus Fire Accident : కాలేజీ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధం..
Bus Fire Accident : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి వద్ద ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రేపల్లె పట్టణంలోని ఐఆర్ఈఎఫ్ సంస్థలకు చెందిన నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రం గుంటూరు కావడంతో, 30 మంది విద్యార్థినులను పరీక్ష రాయించేందుకు బస్సులో తీసుకువెళ్లారు. సరిగ్గా గూడవల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తై బస్సును ఆపాడు. విద్యార్థులను హుటాహుటిన […] -
AP Rains : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు
AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఈరోజు తెల్లవారుజామున నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు.. కోవూరు.. అల్లూరు.. వాకాడు..కోట. ముత్తుకూరు మండలాల్లో కొనసాగుతోంది. తీర ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో.. బీచ్ ల వద్దకు ప్రజలు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార […] -
Top Headlines @9AM : టాప్ న్యూస్
నేడు డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ దేశ భద్రతా వ్యవహారాలపై ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని లోక్‌సేవాభవన్ కన్వెన్షన్ సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోభాల్ తో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు, ఇంటిలిజెన్స్, కోస్ట్‌గార్డ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ శాఖల ఉన్నతాధికారులు సైతం […] -
CM Chandrababu : నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
CM Chandrababu : సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. ఆయన లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో ఈరోజు చంద్రబాబు పర్యటించి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. డిసెంబర్ నెలలో పెన్షన్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో, ఆ రోజు పెన్షన్ పంపిణీ చేయడం కష్టమైన […] -
Veera Aradhana Utsavalu : నేటి నుండి కారంపూడిలో పల్నాటి వీర ఆరాధన ఉత్సవాలు
Veera Aradhana Utsavalu : కారంపూడి గ్రామం ఉత్సాహంతో నిండిపోయి, ఏటా జరుపుకునే పల్నాటి వీరారాధన ఉత్సవాలకు సిద్ధమవుతోంది. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఈ ఐదు రోజుల వేడుకలు ఘనంగా కొనసాగనున్నాయి. 1182లో జరిగిన పల్నాటి యుద్ధంలో అమరులైన వీరులను స్మరించుకునే ఈ ఉత్సవాలు వీరాచారుల మనస్సుల్లో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది వీరాచారులు కారంపూడికి చేరుకుంటారు. ఆచారాలను పాటిస్తూ, ఆయుధాలను దైవాలుగా కొలుస్తూ పూజలు నిర్వహిస్తారు. అనుబంధంగా […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట. నేటి నుంచి డిసెంబర్ 5 వరకు ఆందోళనలు. నేడు ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్న బీజేపీ. రేపు జిల్లా స్థాయిలో ఛార్జ్‌షీట్ విడుదల. డిసెంబర్ 2,3న అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు. నేడు దేశ భద్రతా వ్యవహారాలపై భువనేశ్వర్‌లో డీజీపీ-ఐజీపీల సదస్సు.. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తీర ప్రాంత, జాతీయ భద్రతపై ప్రసంగించనున్న ప్రధాని మోడీ నేడు విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్. హాజరుకానున్న పురంధేశ్వరి, కె.లక్ష్మణ్, శివప్రకాష్. […] -
Pawan Kalyan : రైస్ శాంపిల్స్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్.. ఎమ్మెల్యేపై ఆగ్రహం
Pawan Kalyan : రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో కలకలం రేగింది. ఇవాళ ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యం, అలాగే మరో బార్జ్ ఐవీ 0073 లో 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం […]
తాజావార్తలు
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?