Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్‌మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్‌గా రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీని రాయల్ బాక్స్ నుండి వీక్షించేందుకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. దీనితో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న నాల్గవ భారతీయ కెప్టెన్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న 26 ఏళ్ల గిల్.. రాబోయే వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతూనే, ఇటీవల బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ సర్క్యూట్లో జరిగిన బ్రిటిష్ గ్రాండ్ ప్రి ఫార్ములా-1 రేసును కూడా వీఐపీ అతిథిగా వీక్షించి అక్కడి ప్రముఖులను కలిశాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శనివారం సౌతాంప్టన్‌లో చివరి టీ20 మ్యాచ్ జరగనుండగా, ఆ తర్వాత గిల్ నేతృత్వంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 0-3తో కోల్పోయిన భారత్‌కు, వన్డే సిరీస్ లో గిల్ కెప్టెన్సీ కింద రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు జట్టులోకి రానుండటంతో భారత క్రికెట్ సత్తా చాటడానికి గిల్‌కు ఇది మంచి అవకాశం. ఈ వన్డే సిరీస్‌ను 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకంగా చూస్తున్నామని, దక్షిణాఫ్రికా పరిస్థితులకు ఇక్కడి వాతావరణం సరిపోలుతుందని గిల్ వెల్లడించాడు.
Also Read
- SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
- SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
- Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
- Off The Record: జీహెచ్ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
ఈ సిరీస్ కోసం భారత జట్టులో గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయస్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సుందర్, అక్షర్ పటేల్, నితీష్ రెడ్డి, కుల్దీప్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్, గుర్నూర్ బ్రార్ ఎంపికయ్యారు. ఇంగ్లాండ్ వన్డే జట్టుకు హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, ఆర్చర్, బెథెల్, బట్లర్, సామ్ కరన్, జో రూట్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఇరు జట్ల మధ్య జూలై 14న మొదటి వన్డే, జూలై 16న రెండో వన్డే, జూలై 19న మూడో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!