అమెరికాకు రాహుల్ గాంధీ.. డల్లాస్, వాషింగ్టన్ డీసీల్లో పర్యటన.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 8-10 తేదీల మధ్య ఆయన యూఎస్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లలోని టెక్సాస్ యూనివర్సిటీ సహా పలువురుని కలవనున్నారు. జూన్ నెలలో లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా రాహుల్ గాంధీ అమెరికా వెళ్లబోతున్నారు. ఆయన పర్యటన వివరాలను ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా పంచుకున్నారు. ‘‘రాహుల్ […]
రాష్ట్రంలో భారీ నుండీ అతి భారీవర్షాలు కురుస్తున్నందున నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖాధికారులను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి యన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత ప్రభుత్వ వాతావరణ శాఖా రెడ్ ఏలెర్ట్ ప్రకటించిన నేపద్యంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఈ సమయంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. […]
హైడ్రా వల్ల పేదలకు ఎటువంటి నష్టం కలగకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఏ పార్టీ వ్యక్తుల నిర్మాణాలైనా కూల్చివేస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. గతంలో కేటీఆర్ హై సెక్యూరిటీ ఏరియా అని చెప్పి డ్రోన్ ఎగరవేశాడని, విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని విజ్ఞప్తుల మేరకు మల్లారెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి ఆసవుద్దీన్ విద్యాలయలకు హైడ్రా నోటీసులు పంపిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు పంపిందని ఆయన తెలిపారు. గత […]
గగన్ పహాడ్ గ్రామంలోని అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన పదమూడు షెడ్లను హైడ్రా విభాగం శనివారం ఉదయం కూల్చివేస్తున్నారు . శంషాబాద్ పరిధిలో లో 35 ఎకరాల విస్తీర్ణంలో వున్న గగన్ పహాడ్ చెరువులో అక్రమం నిర్మాణాలు జరుగుతున్నట్లుగా హైడ్రాకు పలు ఫిర్యాదులు రావడంతో దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిన హైడ్రా అధికారులు అప్పా చెరువులో మూడు ఎకరాల పరిధిలో అక్రమంగా […]
రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దేశ విదేశాల్లోని బుద్దిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీ లో భాగంగా తెలంగాణలో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ద క్షేత్రాలతో పాటు హుస్సేన్ సాగర్‌లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కేంద్ర […]
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేడు జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, తెలంగాణా తో పాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలోను భారీ […]
హైదరాబాద్ లో దొంగల హల్ చల్.. రూ.35 లక్షలు దోపిడీ.. హైదరాబాద్ లో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. నగరంలో దారి దోపిడీ దొంగల ముఠా అమాయకులను హడలెత్తిస్తున్నారు. వ్యాపారస్తులే టార్గెల్ చేస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాత్రి ఒంటరి వ్యక్తులే టార్గెట్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యాపారి వద్ద నుంచి సుమారు రూ.35 లక్షలు దోచుకుని వెళ్లిన ఘటన గుడిమల్కాపూర్ లో సంచలనంగా మారింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలోని తిబర్మల్ జ్యువెలర్స్ […]
తెలంగాణలో అంతరించిపోతున్న జానపద కళారూపాలకు పునర్జీవం తీసుకువచ్చేందుకు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని… రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ఱారావు అన్నారు. కళారంగానికి పెద్దపీట వేస్తుందని.కవులు, కళాకారులు, రచయితలకు సముచితస్థానం కల్పిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆద్వర్యంలో. రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరై. ప్రభుత్వ మాజీ […]
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, అవినీతి, అప్పుల్లో కూరుకు పోయి దివాలా తీస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఉచితాలు, హామీలు గ్యారంటీల పేరుతో ఎన్నికలకు ముందు చెప్పి ఎన్నికలయ్యాక ప్రజల గోస పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ కటాకట్ కటాకట్ డబ్బులు వేస్తామని చెప్పారని, ఇప్పుడు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఫటాఫట్ దివాలా తీశాయని ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణ ఢిల్లీకి ఎటీఎంగా మార్చారని, ప్రజల్ని మభ్య పెట్టేందుకు రేవంత్ రెడ్డి […]
ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వ్యవహారం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఇటీవల ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దీనిపైనే ఉంది. అంతేకాకుండా.. రోజు రోజుకు హైడ్రా స్పీడ్ పెంచి అక్రమ కట్టడాలను కూల్చేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే.. హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్న చెరువులను అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేస్తున్న హైడ్రా […]