రెండు రోజుల క్రితం గాజుల రామారంలో కాల్పులు జరిపిన నిందితులను 48 గంటలలో పట్టుకొని మీడియా ముందు హాజరుపరిచారు పోలీసులు.. 27 తారీఖు అర్థరాత్రి గాజుల రామా రం LN బార్ దగ్గర పెట్రోల్ దొంగలిస్తూ జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో అనుచరుడు శివ కంట్రీమేడ్ తుపాకీతో బార్ సిబ్బందిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి తార్ వాహనంతో గుద్ది చంపాలని ప్రయత్నించడం బార్ సిబ్బంది గాయాలతో తప్పించు కొని పోలీసులకు ఫిర్యాదు చేసారు.. […]
గెలుపు అంటే ఎంపీలు, ఎమ్మేల్యేలు గెలవడమే కాదని, ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు అందులో ఒకరు తెలంగాణ నుంచి గెలిచారు. మరొకరు గుజరాత్ నుంచి గెలిచారని, గుజరాత్ లో పార్టీ అధికారంలోకి వచ్చింది.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నామన్నారు ఈటల రాజేందర్. 46 ఏళ్ల తర్వాత తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచామని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, […]
ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2026 మార్చిలో దేవాదుల ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సోనియా గాంధీ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేస్తామని ఆయన వెల్లడించారు. ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని దోపిడీకి కేసీఆర్ పాల్పడ్డారని, ప్రతీ ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు. 1.81 లక్షల నిధులు కేసీఆర్ హాయంలో ఖర్చుపెట్టారని, 14వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో […]
ఆ ఉమ్మడి జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? ఒకప్పుడు పార్టీకి పట్టున్న జిల్లాలో క్రమంగా అంధకారం అలముకుంంటోందా? పక్క పార్టీల్లోకి క్యూ కట్టే నేతల సంఖ్య పెరుగుతోందా? ఇప్పటికే ఓ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పక్కకు జరగ్గా… జిల్లాలో పార్టీకి ఆయువుపట్టు లాంటి నేత కూడా బైబై చెప్పేస్తారా? ఇన్నాళ్ళు ఖండించిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు పరోక్షంగా మనసులో మాటను చెప్పకనే చెప్పారా? ఇంత జరుగుతున్నా సెట్ చేయగలిగిన ట్రబుల్ షూటర్లేని ఆ జిల్లా ఏది? […]
తెలంగాణ బీజేపీ నాయకులు ఢిల్లీ హై కమాండ్‌నే భయపెడుతున్నారా? వాళ్ళు పర్మిషన్ అడిగితే ప్రస్తుతానికి కామ్‌గా ఉండమంటూ దండం పెట్టేస్తున్నారా? ఏ విషయంలో ఢిల్లీ పెద్దలు అంతలా భయపడుతున్నారు? అసలు ఇక్కడి నాయకులు ఏ మేటర్‌లో ఢిల్లీ పెద్దల పర్మిషన్ అడిగారు? రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోంది? తెలంగాణలో బీజేపీ విస్తరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో చేరికలతో నాయకుల సంఖ్య కూడా పెరుగుతోంది. అంతకు ముందు రాష్ట్ర పార్టీలో ఒకరిద్దరు, […]
రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఇటీవల మరణించిన ఊరగొండ రాజు కుటుంబాన్ని కేంద్ర హోoశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నేత కార్మికుల కరెంటు బిల్లుల విషయంలో గత ప్రభుత్వం, కొత్త ప్రభిత్వం మోసం చేసిందన్నారు. నేత కార్మికులకు రెండు పార్టీలు కలిసి 50 శాతం సబ్సిడీ ఇస్తామని మోసం చేశారని, ప్రభుత్వానికి మేము సలహాలు సూచనలు ఇస్తే మాపై నిందలు మోపుతున్నారన్నారు బండి సంజయ్. నేత కార్మికులు […]
మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ నియామకం ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్‌లు ఉండనున్నారు. ప్రస్తుతమున్న మద్యం పాలసీని కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను […]
గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణేష్ నవరాత్రి ఉత్సవాలను సంబంధించి ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలన్నారు. అందరి సలహాలు, సూచనలు స్వీకరించెందుకే ఈ సమావేశం నిర్వహించామని, నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశిస్తున్నానని ఆయన తెలిపారు. చిత్తశుద్ధి, నిబద్దతో ఉత్సవాలు నిర్వహించేలా జాగ్రత్త వహించండని, […]
మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ స్కీంల అమలు, అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల్లో సేవలను మరింత విస్తృతపరచాలని, అంగన్వాడి టీచర్లతో పాటు ఆయాలకు సైతం శిక్షణ కార్యక్రమాలు తరచు నిర్వహించాలన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీలో చిన్నారులకు ఇస్తున్న కోడి గుడ్డును రెండు ముక్కలుగా చేసి ఇవ్వాలని, అప్పుడే చిన్నపిల్లలకు తినడానికి అనువుగా […]
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులకు సిద్ధమైంది. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు సిఫారసు చేసింది హైడ్రా. హెచ్ఎండీఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. Chicken Biryani: బిర్యానీ తినండి, లక్ష పట్టుకెళ్లండి.. ఓ రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అక్రమ నిర్మాణదారులకే కాదు.. నిబంధనలకు […]