వాతావరణ శాఖ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రెడ్ అలార్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా అన్ని వేళల అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ తో ఆదివారం జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు సర్ ప్లస్ అవుతున్న నేపథ్యంలో లోతట్టు […]
హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య.. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి.. భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్ (40), వర్షిణి (33)గా గుర్తించారు. వీరికి రిషికాంత్ (11), విహంత్ (3) పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆన్ లైన్ బెట్టింగ్ వ్యాపారం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ […]
ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ ,మేడిపల్లి సత్యం లతో కలిసి లోయర్ మానేర్ డ్యాం ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ వర్షాలు కూరు స్తున్నాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. అధికారులు ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు. గత కొంత కాలంగా చెరువులు, కుంటలు నిండలేదని ఆందోళన పడుతున్న నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు […]
భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాల కు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు ల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరద తో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని గోదావరి లోకి వదులుతున్నారు. […]
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు సెలవులు పెట్టొద్దన్నారు. స్థానిక పరిస్థితుల మేరకు రేపు స్కూల్స్ కు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఖమ్మంలో నాకు కావాల్సిన ఓ ముస్లిం కుటుంబం వరదల్లో చిక్కుకుందని, వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. […]
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు నేపద్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు 24/7 అప్రమత్తంగా ఉండాలన్నారు. *రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు గురించి ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా […]
పార్టీ మేనిఫెస్టోతో సంబంధం లేకుండా సొంత స్కీమ్స్ ప్రకటించేశారా ఎమ్మెల్యే. నన్ను చూసి ఓటెయ్యండి, నా పథకాల్ని చూడండి. 150 కోట్లు ఖర్చయినా సరే… సొంత ఆస్తుల్ని అమ్మి అయినా సరే… నియోజకవర్గాన్ని నందనవనం చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. గెలిచినా, ఓడినా ఆరు నెలల్లో అన్నీ మొదలుపెడతానన్న లీడర్.. తీరా గెలిపించి 9 నెలలు అవుతున్నా ఆ ఊసేలేదట. నియోజకవర్గ ప్రజలు రివర్స్ అవుతున్నారని భయపడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏంటి ఆయన సొంత హామీలు? కామారెడ్డి […]
తెలంగాణ బీజేపీకి కొత్త అస్త్రం దొరికిందా? దాంతోనే కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్లాన్‌లో ఉందా? అందుకే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే టార్గెట్ చేసిందా? కాషాయ నేతల వరుస స్టేట్మెంట్స్ ఈ విషయమే చెబుతున్నాయా? ఇంతకీ బీజేపీకి దొరికిన ఆ అస్త్రం ఏంటి? ఏ పేరుతో నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు? ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి.. ఐదున్నర నెలలపాటు జైల్లో ఉండి.. ఇటీవలే బయటికి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అదంతా గతం. అయితే […]
కడప జిల్లాలో జడ్పీటీసీలకు ఆఫర్ల మీద ఆఫర్లు….. బంపరాఫర్లు తగులుతున్నాయా? మీ పంట పండింది పోండి… ఇక పండగ చేస్కోండి… మంచి తరుణం మించిన దొరకదంటూ వాళ్ళని ఉద్దేశించి ఎందుకు అంటున్నారు? అసలు కడప జిల్లా పరిషత్‌లో ఏం జరుగుతోంది? జడ్పీటీసీలకు ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయి? ఖాళీ అయిన కడప జిల్లా పరిషత్ చైర్మన్ సీటు దక్కించుకునేందుకు అటు టిడిపి ఇటు వైసీపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. జడ్పీలో టిడిపికి బలం లేకున్నా…వలసల్ని నమ్ముకుని రాజకీయం చేయాలనుకుంటున్నట్టు […]
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి […]