Pawan Kalyan Varahi Declaration LIVE : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం తిరుపతిలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇది అధికారం చేపట్టిన తర్వాత తన మొదటి భారీ సభ. ఈ కీలకమైన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్‌ను ఆవిష్కరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జ్యోతిరావు పూలే సర్కిల్లో జరిగే సభను విజయవంతం చేసేందుకు జనసేన, కూటమి పార్టీ స్థానిక నేతలు సమన్వయంతో ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ […]
కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం.. ఈ నవరాత్రులలో ప్రత్యేకం.. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి.. కనకదుర్గమ్మ భక్తులకు బాలాత్రిపురసుందరిగా దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో వస్తున్నారు.. తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు.. ఈసారి ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసిందంటున్నారు భక్తులు.. మరోవైపు..ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం అందజేశారు ముంబైకి చెందిన సౌరభ్.. […]
నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూ. 43 లక్షల విలువ చేసే అల్ఫాజూలం,. క్లోరోహైడ్రేట్ ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్టిఎఫ్ టీం, టీం లీడర్ ప్రదీప్ రావు కు వచ్చిన సమాచారం మేరకు నిర్మల్ లోని ద్వారకా నగర్ లో గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో 3.3 కిలోల అల్ఫాజూలం, శాంతినగర్ లో ఒక గోదాం లో నిల్వ చేసిన 728 క్లోరోహైడ్రేట్ నిలువలను ఎస్టిఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2016 నుంచి 24 […]
హైడ్రా విషయంలో హైకోర్టు హెచ్చరించినా సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెచ్చారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. బీజేపీ గవర్నర్ హైడ్రా ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారని, రేవంత్ రెడ్డి పాలనలో కేటీఆర్ కాన్వాయ్ పై దాడి జరిగిందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ ను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని, మైనంపల్లి కేటీఆర్,హరీష్ రావులపై దాడులు చేస్తామని అంటున్నారని, రేవంత్ రెడ్డి కొట్టండి,చంపండి అనే మాటలను కాంగ్రెస్ నేతలు అమలు చేస్తున్నారన్నారు దాసోజు శ్రవణ్. కొండా […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సికింద్రాబాద్‌లోని హాకీ గ్రౌండ్స్‌లో “ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌ల” పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు పదేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా గత కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదని.. కానీ ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు అందించాలని మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. వివిధ రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేశామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌లను ప్రవేశపెట్టామన్నారు. “సంక్షేమ […]
వైసీపీ అధిష్టానానికి తత్వం బోథపడిందా? ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయన్న సంగతిని గ్రహించిందా? చేతులు కాలాకైనా ఆకులు పట్టుకుని కాస్త ఉపశమనం పొందుదామని అనుకుంటోందా? ఆ క్రమంలోనే ప్రస్తుతం పార్టీలో మార్పులు చేర్పులు జరుతున్నాయా? ఇంతకీ వైసీపీ పెద్దల్లో వచ్చిన ఛేంజ్ ఏంటి? జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏకంగా 82 సిట్టింగ్ సీట్లను అప్పట్లో మార్చారు జగన్. ఇందులో కొందరికి […]
మా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో డిసెంబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వ నిర్ణయాలు క్లారిటీగా చెప్పారని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా, మూసీ లాంటి కార్యక్రమాల గురించి చెప్పారని, పేద,మధ్యతరగతి కుటుంబ అవసరాలు తెలుస్కొని అవి తీర్చడానికే మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మాది పేద ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని, మూసీ నది ప్రక్షాళన […]
తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవడానికి వెంటనే జిల్లాలను సందర్శించాలని ప్రత్యేక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ప్రత్యేక అధికారిగా రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి నియమించారు. Sree Vishnu: మగ గొప్పా ? ఆడ గొప్పా ? అనేదే కథ : హీరో శ్రీవిష్ణు ఇంటర్వ్యూ కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, […]
‘పెళ్లి కోసం అంబానీ కోట్లు ఖర్చుపెట్టారు.. అది మీ డబ్బే’ హర్యానాలో అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీలలో తమ అభ్యర్థుల కోసం అన్ని పార్టీల నేతలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బహదూర్‌ఘర్‌లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడి […]
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. బతుకమ్మ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తర తరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు […]