బాపట్ల జిల్లా కొల్లూరు మండలం లో, ఇటీవల వచ్చిన వరదల దెబ్బకు అనేక కుటుంబాలు విలువలాడుతున్నాయి… అధికారుల నిర్లక్ష్యంతో, లంక గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు కనీస నష్టపరిహారం అందనేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి… దీంతో సర్వం కోల్పోయిన వలస కుటుంబాలు, చెట్ల కింద పుట్ల గట్టున తలదాచుకుంటున్నారు… 10 సంవత్సరాల క్రితం గోదావరి జిల్లా నుండి, వలస వచ్చిన కొన్ని కుటుంబాలు, కొల్లూరు సమీపంలో నివాసం ఉంటున్నాయి, స్థానికంగా ఇటుక బట్టీల్లో, ఇతర వ్యవసాయ భూముల్లో కూలి […]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం రేణిగుంట చేరుకుంటారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. రాత్రి 9 గంటలకు బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్దశేషు వాహనసేవలో పాల్గొంటారు. అనంతరం రాత్రికి శ్రీ పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. 5వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ వకుళమాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభిస్తారు. ఉదయం 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం […]
రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఎప్పటికప్పుడు చెప్పినప్పటికి బీజేపీ పెద్దలు, రాష్ట్ర నాయకులు రైతులను గందరగోళ పరిచి వాళ్ల రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీశారు. వారికి అర్థమయ్యే విధంగా మరొక్కసారి వివరాలన్ని తెలియజేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 65.56 లక్షలు అని, వీరిలో తెలంగాణ రాష్ట్రంలో భూములు ఉండి, తెలంగాణలో ఉన్న బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 42 లక్షలు అని […]
తెలంగాణ రాష్ట్రంలో 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని, ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన గురువారం క్విటో నగరానికి సమీపంలో ఉన్న ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్ ను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. ఆయనకు రోహ్మ్ కంపెనీ ప్రెసిడెంట్ ఇనో, కంపెనీ ఉన్నతాధికారులు తకహసి, […]
దక్షిణ తైవాన్ను హడలెత్తించిన క్రాథాన్ తుఫాన్.. ఇద్దరు మృతి దక్షిణ తైవాన్ను టైఫూన్ క్రాథాన్ బెంబేలెత్తించింది. అత్యంత శక్తివంతంగా తుఫాన్ దూసుకొచ్చింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో వస్తువులు గాల్లోకి ఎగిరిపోయాయి. భారీ ఎత్తున ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు. ఇక భారీ వర్షం కారణంగా ప్రధాన ఓడరేవు నగరం కాహ్సియంగ్ను ముంచెత్తింది. దీంతో ద్వీపాన్ని రెండో రోజు కూడా మూసివేశారు. […]
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్సీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ […]
ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర యువత క్రీడల వైపు వెళ్లకుండా వ్యసనాలకు బానిసలు అవుతున్నారని అన్నారని.. ఇది బాధ కలిగిస్తోందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఒలింపిక్స్లో భారత్ స్థితిపై యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేసినట్టు ఆరోపించారు […]
మూసీ నది ప్రక్షాళన ప్రజలకి స్వచ్ఛమైన గాలి నీరు అందించాలని అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగా నదికి సంబంధించిన కూడా ప్రక్షాళన జరిగినప్పుడు బఫర్ జోన్,ftl ఇవ్వటం జరిగింది ఎందుకంటే వరదలు వచ్చినపుడు ఎలాంటి నష్టం జరగకూడదు అని ఆయన తెలిపారు. 2017 వచ్చిన go ఇప్పుడు అమలు చేస్తున్నామని, NGO లతో కలిసి మేము మీటింగ్ […]
సీఎం రేవంత్ కు.. మల్కాజిగిరి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే ఇద్దరం సెక్యురిటీ లేకుండా మూసీ పరివాహ ప్రాంతానికి వెళ్దామని, మూసీ పరివాహ ప్రాంత ప్రజలు నిన్ను శభాష్ అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని, ముక్కు నేలకురాసి క్షమాపణ చెబుతా అని ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రజల చేత ఇంతగా తిట్టించుకున్న నాయకుడు ఎవరు లేరు అని, గర్భిణీ అని చూడకుండా ఇళ్లు […]