సినీనటి జెత్వానీ కేసులో కొత్త కొత్త ట్విస్ట్‌లు ఉంటాయా? ఇంకొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ మెడకు చుట్టుకోబోతోందా? ఈ ఎపిసోడ్లో మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి పేరు ఎందుకు వస్తోంది? ఇప్పటికే సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్‌లు మరికొన్ని కేసుల్లో కూడా ఇరుక్కోబోతున్నారన్నది నిజమేనా? అసలు జెత్వానీ కేసు కేంద్రంగా జరగబోతున్న కొత్త పరిణామాలు ఏంటి? సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీకి చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యారు. అది కూడా ఆమెను కేసులతో […]
తెలంగాణలో డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (సెప్టెంబర్ 30) విడుదల చేశారు. సచివాలయంలో ఫలితాలను ప్రకటించిన ఆయన, దసరా పండుగకు ముందు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. సీఎం ప్రకటించిన ప్రకారం, టీచర్ల ఎంపిక ప్రక్రియలో విద్యాశాఖ యాక్టివ్‌గా పని చేస్తోంది. అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై చేసిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల […]
హమాస్ అధినేత జాడ తెలిసినా చంపకుండ వదిలేసిన ఇజ్రాయెల్.. హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ ఉన్న ప్రదేశం తెలిసిన కూడా ఇజ్రాయెల్ అతడిని మట్టుబెట్టకుండా వదిలేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్12 న్యూస్ ఓ కథనంలో తెలిపింది. ఇటీవల ఐడీఎఫ్ బలగాలకు సిన్వార్ కదలికలపై బలమైన ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చింది. అక్కడే పలువురు బందీలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆ ఛాన్స్ ను వినియోగించుకొని అతడిని చంపేస్తే.. అది బందీల ప్రాణాలకు తీవ్ర […]
ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కన్నెర్ర చేశారు. అధికారుల అలసత్వం మిల్లర్లు ఇష్టారాజ్యంతో కోట్లాది రూపాయల ధాన్యం అక్రమార్కుల చేతిలో కి వెళ్లడం పై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కు మంత్రి తుమ్మల స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అక్రమంగా ధాన్యం తరలింపు పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు. ధాన్యం పక్కదారి పట్టడానికి కారకులను […]
పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయదని హైడ్రా అధికారులు వెల్లడించారు. ప్రజలు గమనించాలి.. అసత్య ప్రచారాలు నమ్మొద్దని, హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే అని తెలిపారు. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరుకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, హైడ్రా పేదల నివాసాల జోలికి వెళ్లదు. అలాగే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చదన్నారు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావు. ప్రజలు, సామాజిక […]
మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర్కార్ ఒక్క ఇల్లు కూడా తొలగించలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో సీఎంకి వ్యతిరేకంగా పెయిడ్ ప్రచారం చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని, బీఆర్ఎస్ వందల కోట్లు సోషల్ మీడియా పై పెట్టుబడి పెట్టిందని ఆయన ఆరోపించారు. జన్వాడ ఫాం హౌస్ చుట్టూ జరిగిన అభివృద్దే.. హైదరాబాదు అభివృద్ధా? 2015_16 లో మల్లన్న సాగర్ లో […]
వారం రోజుల అమెరికా పర్యటన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మూడు రోజుల పర్యటనకు జపాన్ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం హానిడా విమానాశ్రయంలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేథి, మధుసూదన్, అమన్ ఆకాష్ ఆయనకు స్వాగతం పలికారు. ఆయనతోపాటు రాష్ట్ర బృందం లో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణ రావు, ఇంధన శాఖ కార్యదర్శి డి. రోనాల్డ్ రోస్, […]
పోటీకి వైసీపీ దూరం.. పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ..! గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భారీ విజయాన్ని అందుకున్నారు.. ఇక, జనసేన ప్రభుత్వంలో కీలకభూమిక పోషిస్తుండగా.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అయితే, ఇప్పుడు పిఠాపురంలో జరుగుతోన్న ఓ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉండగా.. […]
మెగా అభిమానుల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. మావెరిక్ చిత్ర నిర్మాత శంకర్ షణ్ముఖం డైరక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు. ఇప్పటికే మొదటి పాట ‘జరగండి జరగండి’ సాంగ్ అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రెండో పాట ‘రా మచ్చా.. మచ్చా’ సైతం అభిమానులను ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ యాక్షన్ […]
మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఇటీవల జరుగుతున్న కొన్ని ఆందోళనలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరణ ఇచ్చారు. నదీ పరివాహక ప్రాంతంలో నివాసితుల భద్రత, పునరావాసం, కూల్చివేతలకు సంబంధించిన వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, కమిషనర్ కొన్ని ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. మూసీ నదికి ఇరువైపులా జరుగుతున్న సర్వేలు హైడ్రాకు సంబంధించినవి కాదని స్పష్టంగా అవగాహన చేయాలని కోరారు. ఈ సర్వేలు హైడ్రా చట్టం లేదా ప్రాజెక్టుకు సంబంధించినవి కాదని తెలిపారు. మూసీ నదీ పరివాహక ప్రాంతంలో […]