జానపద సింగర్, రైటర్ మల్లిక్‌తేజ తనపై లైంగికదాడికి యత్నించాడని సహచర గాయని గత ఆదివారం జగిత్యాలలోని టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. అయితే.. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజాకు హైకోర్టులో ఊరట లభించింది. మల్లిక్ తేజ్‌కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఫోక్ సింగర్ మల్లిక్ తేజా తరఫు న్యాయవాది లక్ష్మణ్ మాట్లాడుతూ.. […]
శివరామరాజు ఫేమ్ వెంకట్, ఈ సినిమాతో మాస్ హీరోగా అవతారమెత్తుతున్నాడు. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శనివారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం గ్లింప్స్‌ను విడుదల చేశారు. నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ చిత్రానికి ఇంత స్థాయికి రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్లూ పనిచేశారు. హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా […]
కాంగ్రెస్ వేదికపైనే మహిళా నేతకి లైంగిక వేధింపులు.. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తు్న్న కార్యక్రమం సభా వేదికపైనే ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపులకు గురైంది. పార్టీ సీనియర్ నేత దీపేందర్ హుడా సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు సెల్జా కుమారి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత తాను బాధిత […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన బావమరిది సుధీర్ బాబు రాబోయే ఫ్యామిలీ డ్రామా మా నాన్న సూపర్ హీరో థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. మహేష్ ఈ సాయంత్రం X కి తీసుకొని ట్రైలర్‌ను లాంచ్ చేసాడు, అలాగే సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాను అని కూడా జోడించాడు. మా నాన్న సూపర్ హీరో యొక్క ట్రైలర్ కొడుకు , అతని తండ్రి మధ్య కొన్ని పదునైన , హృదయపూర్వక భావోద్వేగాలను ప్రదర్శిస్తుంది, ఇందులో వరుసగా సుధీర్ […]
శ్రీవిష్ణు ఎప్పుడూ ప్రత్యేకమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తారు. అతని కొత్త చిత్రం స్వాగ్ ఇప్పుడు థియేటర్లలో విడుదలైంది. సూపర్‌హిట్ రాజా రాజ చోరా తర్వాత శ్రీవిష్ణు , హసిత్ గోలీల కలయికలో ఈ చిత్రం రెండవది. వీరిద్దరి మొదటి చిత్రం వలె కాకుండా, స్వాగ్ విమర్శకుల నుండి తక్కువ-సమాన సమీక్షలను పొందింది. కాన్సెప్ట్ , శ్రీవిష్ణు యొక్క బహుముఖ నటన ప్రశంసించబడినప్పటికీ, సినిమా దాని మెలికలు తిరిగిన స్క్రీన్‌ప్లే కోసం విమర్శించబడింది. ఈ క్రేజీ ఎంటర్టైనర్ […]
సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి, కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం సాయంత్రం గాయత్రికి ఈ ఆరోగ్య సమస్య రావడంతో, హైదరాబాదులోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే శనివారం మరణించింది. ఈ సంఘటనతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గాయత్రి భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ఇంటికి తీసుకువచ్చారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం “మట్కా” కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల , రాజని తల్లూరి నిర్మాణంలో వైరా ఎంటర్టైన్మెంట్స్ , ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లలో రూపొందించబడింది. ఈ చిత్రం, సాధారణ వ్యక్తి ఒక మట్కా కింగ్ గా ఎదుగుదల పొందడం గురించి ఉంటుంది. టీజర్లో ప్రదర్శించిన పాత్ర ముఖ్యంగా, జైలులో ఉన్నప్పుడు జైలర్ […]
పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను మధురైలోని కమిషనరేట్ లో వాంజినాధన్ అనే లాయర్ కంప్లైంట్ ఇచ్చాడు. సనాతన ధర్మం పై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించారని ఫిర్యాదులో తెలిపారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన […]
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై నమోదైన లైంగిక ఆరోపణల నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు దర్యాప్తును తీవ్రంగా ముందుకు తీసుకెళ్లుతున్నారు. ఆయన విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడంటూ, బాధితురాలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, హర్ష సాయి పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బాధితురాలితో సన్నిహితమైన హర్ష సాయి, ‘మెగా’ సినిమా కాపీ రైట్స్ కోసం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆమె ఆరోపించింది. ఈ ఫిర్యాదు చేసిన […]
జి.వెంకటస్వామి (కాకా) 95వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరు అని, గతంలో ఉన్నవారు కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూశారో.. లేక ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయాలనుకున్నారో తెలియదన్నారు. కాకా జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని నేను అధికారులను ఆదేశించా అని, ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదని కాకా […]