దొరికిన దొంగలు మళ్ళీ సమర్తించుకునే విధంగా ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారని, తాగి దొరికిన కేసులో బుకాయించి మాట్లాడితే తప్పు ఒప్పైతదనుకుంటే పొరపాటు అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వానికి అనేక ప్రజాహిత పనులు కార్యక్రమాలు ఉన్నాయి..నిన్న ఒకవైపు కేబినెట్ సమావేశం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, పోలీసులు విధి నిర్వహణలో స్థానికుల పిర్యాదు మేరకు రైడ్ చేస్తే దొరికిన రాజకీయ పెద్దల బందువులు అది ఒప్పు అన్నట్లుగా పోలీసులను విమర్శించే విధంగా జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విచారణ కొనసాగుతుంది. ప్రభుత్వం నుండి ఎలాంటి కక్ష సాధింపు దోరణిలో పోలీసులు అక్కడికి వెళ్లి రైడ్ చేయమని చెప్పలేదని, ముఖ్యమంత్రి మంత్రులు ప్రజాహిత కార్యక్రమాల్లో ఉన్నారన్నారు. కావాల్సికొని ఈ అంశాన్ని రాజకీయ చేయడానికి మాజీ మంత్రులు , శాసనసభ్యులు ప్రైవేట్ ఫంక్షన్ లో కూడా తాగినప్పుడు అనుమతి అవసరం అని తెలుసుకోవాలని, పోలీసులను ప్రతి ఫాం హౌస్ లో ఏం జరుగుతుందని క్షుణ్ణంగా చూడామని చెప్పలేదన్నారు. ఫిర్యాదు ద్వారా వచ్చిన అంశం మీద బీజేపీ హోంశాఖ సహాయ మంత్రి కుమ్మక్కై కేసును నిర్వీర్యం చేస్తున్నారని అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఏం మాట్లాడరని ఆయన అన్నారు. ఈ కేసు మీద మీ పార్టీ స్టాండ్ ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలని, బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వాన్ని రక్షించడానికి మాదకద్రవ్యాలు తీసుకోవడం మా జన్మహక్కు అనే విధంగా మాట్లాడడాన్ని సమాజం చూస్తుందన్నారు మంత్రి పొన్నం.
Actor Vijay: గవర్నర్ తొలగించడం- తమిళం-కులగణన.. విజయ్ పార్టీ లక్ష్యాలు..
అంతేకాకుండా..’ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం,మంత్రులు ఫాం హౌస్ లో మీద రైడ్ చేయమని చెప్పలేదు.. అర్ధరాత్రి వచ్చిన డిస్టబెన్స్ ఫిర్యాదు మేరకు రైడ్ జరిగిందని ప్రాథమిక విచారణ తేలింది.. మీరు నిజంగా నిర్దోషులైతే చట్టం ద్వారా క్లారిఫికేషన్ తెచ్చుకోండి.. కేసును వదిలిపెట్టి హోంశాఖ సహాయం మంత్రి పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా వారి సామర్థ్యతను శంకిస్తున్నారు. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయద్దు.. రాజకీయ మిత్రులకు లొంగకుండా కేసు విచారణ చేయాలని పోలీసులను కోరుతున్నా.. రాజకీయాల్లో ఉన్నవారు కేసులు నిర్వీర్యం చేయడానికి ఆరోపణలు చేసి అక్రమంగా బనాయించాల్సిన అవసరం లేదు.. న్యాయం ప్రకారం ,చట్టం ప్రకారం కేసు నిర్వహించండి.. చట్టం ,శాంతి భద్రతలకు ప్రజాస్వామ్యం దానికి సంబంధించిన విషయంలో ఎలా ఉండాలో ప్రభుత్వం వల్ల వ్యవహరిస్తుంది.. ఎక్కడ కక్ష సాధింపు చర్యలు లేవు.. మాజీ మంత్రులు బిహారీ శాసనసభ్యులు ఆలోచన చేయాలి ఇందులో ముఖ్యమంత్రి, మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఉందనడం వారి అవివేకం..’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Jagadish Reddy : కారణం, వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారు..