Jagadish Reddy : కారణం, వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారు..
- ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు దుర్మార్ఘంగా వ్యవహరిస్తున్నారు
- ఎక్కడ ఎదో జరిగితే అది KTRకి ఎం సంబంధం
- రేవంత్ సోదరులపై చాలా ఆరోపణలు వస్తున్నాయి
- రేవంత్ సోదరుల ఇళ్ళపై పోలీసులకు ఇలాగే చేసే దమ్ముందా : జగదీష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జన్వాడ ఫార్మ్ హౌస్, కేటీఆర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం పై మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లడుతూ.. KTR ఇంటి పై దౌర్జన్యంగా దాడి చేయడం ఖండిస్తున్నామన్నారు. కారణం, వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని, ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు దుర్మార్ఘంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎక్కడ ఎదో జరిగితే అది KTR కి ఎం సంబంధమని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ సోదరులపై చాలా ఆరోపణలు వస్తున్నాయని, రేవంత్ సోదరుల ఇళ్ళ పై పోలీసులకు ఇలాగే చేసే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. స్వయంగా పోలీసులే రేవంత్ తమ్ముడితో సెటిల్ చేసుకోమ్మని బాధితులకు చెబుతున్నారని, కాంగ్రెస్ , బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమన్నారు జగదీష్ రెడ్డి. పై నుండి మోడీ , ఆదానీలే రేవంత్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, నిజామ్ కాలంలో కూడా ఇంతలా దుర్మార్ఘంగా పనిచేయలేదన్నారు జగదీష్ రెడ్డి. చిల్లర దాడులు మమ్మల్ని భయపెట్టలేవు.. మాకు అరెస్టులు కొత్త కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Israel Iran: ఇరాన్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన ఇజ్రాయిల్..
Also Read
అంతేకాకుండా..’FIR, సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారు. ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే ఇలాంటి దాడులు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లో KTR కి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే దాడులు. వరదల సందర్బంగా భౌతిక దాడులు చేస్తేనే ఎం కాలేదని ఇప్పుడు పోలీసులను వాడుతున్నారు. ప్రజా గొంతుకైన KTR కి సమాధానం చెప్పలేక చిల్లర వేషాలు. పొంగులేటి ఇంట్లో విదేశీ వాచీల వ్యవహారం ఎటుపోయింది. మంత్రుల ఇళ్ళల్లో సోదా చేస్తే మీరనుకున్నయి దొరుకుతాయి. ఎన్ని కుట్రలు చేసినా మా ప్రజాపోరాటం ఆగదు. ప్రజలే KTR ని రక్షించుకుంటారు. సెక్యూరిటీ లేకుండా వస్తే KTR, రేవంత్ చేరిష్మా తెలుస్తుంది. తెలంగాణలో గృహ ప్రవేశానికి దావత్ లు జరగడం సర్వ సాధారణం. మంత్రులే పట్టపగలు తాగి తిరుగుతున్నారు వారికి పరీక్షలు చేస్తారా.. లేనివి ఉన్నట్టు సృష్టించి కేసులు బనాయించాలని చూస్తున్నారు. మీరు ఎంత దుర్మార్గానికి దిగజారినా.. KTR ఇమేజ్ పెరుగుతుంది తప్ప తగ్గదు.. కార్పొరేట్లకు దోచే కుట్రను దారిమరల్చేందుకే ఇదంతా.. చట్ట పరిధిలో పనిచేయకపోతే డీజీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తప్పకుండా తగిన మూల్యం తప్పదు.. కాంగ్రెస్ చెప్పినట్లు కాకుండా పోలీసులంతా చట్ట పరిధిలో పనిచేయండి.. రౌడీల్లాగా చట్టవిరుద్దంగా పోలీసులు వస్తున్నారు.. అనుమతి లేకుండా రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. వెంటనే సోదాలు అపి పోలీసులు వెనక్కి రావాలి.. దాడులు ఇలానే కొనసాగితే పోలీసుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..’ అని జగదీష్ రెడ్డి అన్నారు.
IND vs NZ: ఏం పట్టింది భయ్యా.. గాల్లోకి డైవ్ చేసి మరీ (వీడియో)
- Tags
- bjp
- congress
- jagadish reddy
- ktr
- NEWS
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!