DS Chauhan : ఇప్పటి వరకు 13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
- కొనుగోలు చేసిన ధాన్యం ఖరీదు 3,045.76 కోట్లు
- సన్నాలకు 9.21 కోట్ల బోనస్ చెల్లింపు
- ఈ నెల 23 నాటికి 90 శాతం బోనస్ చెల్లింపులు
- సాంకేతిక కారణాలతో చెల్లింపులలో జాప్యం
- సంవత్సరాంతంలో పీడీఎస్ బియ్యం నిలువరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DS Chauhan : ఇప్పటి వరకు 13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యం ఖరీదు 3,045.76 కోట్లు అని, సన్నాలకు 9.21 కోట్ల బోనస్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 23 నాటికి 90 శాతం బోనస్ చెల్లింపులు అవుతాయన్నారు. సాంకేతిక కారణాలతో చెల్లింపులలో జాప్యం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. సంవత్సరాంతంలో పిడిఎస్ బియ్యం నిలువరింపు చేస్తున్నట్లు, జనవరి నుండి సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో 2.81 లక్షల మందికి ప్రయోజనం కలగనుందన్నారు. లొసుగులను అడ్డుకునేందుకే ధాన్యం కొనుగోలులో సంస్కరణలు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.
Rajnath Singh: కోటి దీపోత్సవ ప్రభ మాటలకందని విధంగా ఉంది..
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
పాత పాలసీలో లోపాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని, 2014 నుండి 2023 వరకు కార్పొరేషన్ పై 58,623 కోట్ల భారం పడిందన్నారు. సంవత్సరంలోగా 11,608 కోట్ల రికవరీ చేస్తామని, బ్యాంక్ గ్యారెంటీ పై అపోహలు వద్దన్నారు. సియంఆర్ బియ్యం ప్రభుత్వానికి చేరంగానే బ్యాంక్ గ్యారెంటీ వాపస్ వస్తుందన్నారు. బ్యాంక్ గ్యారెంటీతో మరోదానికి ముడి పెట్టె ప్రసక్తి లేదని, లీజ్ పేరుతో మోసాలను అరికట్టేందుకే నో డ్యూస్ సర్టిఫికెట్లు తప్పనిసరి అని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా ధాన్యం కేటాయింపులు ఉండవని, ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డ వారికి కేటాయింపులు ఉండవన్నారు. అవకతవకలకు పాల్పడ్డ మిల్లర్లు 362 మందని, అవకతవకలకు పాల్పడని రైస్ మిల్లర్లకు 10%బ్యాంక్ గ్యారెంటీ, అవకతవ్వకలకు పాల్పడి తిరిగి అసలు పెనాల్టీ చెల్లించిన వారికి 20 శాతం విధిస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!