Crime : భార్యను హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టిన భర్త
- మహబూబ్‌నగర్ జిల్లాలో భయానక ఘటన
- భార్యను హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో పూడ్చిన భర్త
- దుర్వాసన వ్యాపించడంతో విషయం వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime : మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో సోమవారం భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యను హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం, మారేపల్లి నారమ్మ (45) మరియు వెంకటయ్య దంపతులు. నారమ్మ ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేస్తుండగా, వెంకటయ్య గొర్రెల కాపరిగా పనిచేసేవాడు.
Pushpa 2: ఓవర్సీస్ లో మరో మైలురాయి చేరుకున్న’పుష్ప -2′
ఈ నెల 17న నారమ్మ కనిపించకపోవడంతో ఆమె భర్త వెంకటయ్య తన కుమారుడు భరత్‌కు సమాచారం అందించాడు. భరత్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 21న భరత్ తన తండ్రితో కలిసి భూత్పూర్ పోలీసులకు మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేశాడు. ఎస్సై చంద్రశేఖర్ ఈ కేసును నమోదు చేసి నారమ్మ ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభించారు.
Also Read
సోమవారం ఉదయం గ్రామ పరిసర ప్రాంతంలో దుర్వాసన వ్యాపించడంతో గ్రామస్తులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే.. సెప్టిక్ ట్యాంక్‌లోని చెత్తను పరిశీలించగా, నారమ్మ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. నారమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!