APSRTC : ఆర్టీసీ బస్సుల్లో వృద్దుల ప్రయాణానికి రాయితీ టికెట్లు.. మార్గదర్శకాలు జారీ
- ఆర్టీసీ బస్సుల్లో వృద్దుల ప్రయాణానికి రాయితీ
- టికెట్ల జారీకి పాటించాల్సిన నియమాలతో సిబ్బందికి APSRTC మార్గదర్శకాలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APSRTC : ఆర్టీసీ బస్సుల్లో వృద్దుల ప్రయాణానికి రాయితీ టికెట్ల జారీ కి పాటించాల్సిన నియమాలతో సిబ్బందికి మరోసారి APSRTC మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని జిల్లాల డీపీటీవో, ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పల రాజు ఆదేశాలు జారీ చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్దులకు బస్సుల్లో ప్రయాణానికి టికెట్ ధరలో 25 శాతం రాయితీ టికెట్లను ఎప్పట్నుంచో ఆర్టీసీ జారీ చేస్తోంది. టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్దారణ కోసం గుర్తింపు కార్డులు చూపించే విషయమై సిబ్బందికి, వృద్దులకు మధ్య బస్సుల్లో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బంది కేవలం ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటేనే జారీ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డులను అంగీకరించడం లేదు. ఒరిజినల్ లేనప్పుడు డిజిటల్ కార్డులు చూపించవచ్చని తెలిపినా అవగాహన లేమితో టికెట్ల జారీకి నిరాకరిస్తున్నారు. దీనిపై పలు ప్రాంతాల నుంచి వృద్దులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.
Konda Visveshwar Reddy: ఖురాన్‌లో వక్ఫ్ ప్రస్తావన లేదు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Also Read
దీంతో రాయితీ టికెట్ల జారీ కోసం పాటించాల్సిన నియమ నిబంధనలను తెలియజేస్తూ సిబ్బందికి తాజాగా మరోసారి ఆదేశాలిచ్చింది. వృద్దులు వయసు నిర్దారణ కోసం 6 రకాలైన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించవచ్చని తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఆర్టీసీ తెలిపింది. వృద్దులు తమ ఆధార్ కార్డు లేదా సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు లేదా పాన్ కార్డు సిబ్బందికి చూపించి రాయితీ టికెట్ పొందవచ్చని తెలిపింది. వృద్దులు తమ ఓటర్ ఐడీ, లేదా పాస్ పోర్టు, లేదా రేషన్ కార్డు ల్లో ఏదో ఓకటి చూపించి రాయితీ పొందవచ్చని స్పష్టం చేసింది. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకపోతే.. ఫోన్లో డిజిటల్ గుర్తింపు కార్డులు చూపినా రాయితీ టికెట్ జారీ చేయాలని సిబ్బందికి ఆర్టీసీ ఆదేశించింది. ప్రాంతం, రాష్ట్రంతో సంబంధం లేకుండా అందరికీ, అన్ని బస్సుల్లో వృద్దులకు రాయితీ టికెట్లు ఇవ్వాలని ఆర్టీసీ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!