Tummala Nageswara Rao : మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ అఫ్ ఇండియా , నేషనల్ జ్యూట్ బోర్డు వారి సౌజన్యంతో ఈ క్రాఫ్ట్ మేళను నిర్వహించడం జరుగుతున్నది. ఈ మేళాకు హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అతిధులుగా విచ్చేసి మేళాను ప్రారంభించారు. శిల్పారామంలో ఉన్న చేనేత కళాకారుల ఉత్పత్తులను సందర్శించారు. శిల్పారామం లో ని బృందావనం ను తిలకించారు. ఈ క్రాఫ్ట్స్ మేళ ను ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 నుండి 31st వరకు నిర్వహించుకుంటున్నం. ఈ క్రాఫ్ట్స్ మేళను గత ౩౦ సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా 20 రాష్టాల నుండి వచ్చిన చేనేత కళాకారులూ వారి ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుంది.చేనేత ఉత్పత్తులకి సంబంధించి వంద స్టాల్ల్స్, జ్యూట్ ఉత్పత్తులకు సంబంధించి 31 స్టాల్ల్స్, శిల్పారామం ఆధ్వర్యం లో చేనేత హస్తకళలు, వూడ్కార్వింగ్, టెర్రకోట మొదలైన ఉత్పత్తులకు సంబంధించి 300 పైగా స్టాల్ల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
Varun Tej Wishes Lavanya Tripathi: హ్యాపీ బర్త్‌డే బేబీ! అంటూ భార్యకు విషెస్ చెప్పిన వరుణ్ తేజ్
ఈ మేళాలో గద్వాల్, పోచంపల్లి, మంగళగిరి, నారాయణపేట, కోట డోరియా, చెందేరి జాంధానీ,పైతాని, పటోళ్ల చీరలు, కాటన్ అద్దకం చీరలు, చెద్దర్లు, వరంగల్ కార్పెట్లు , పష్మీనా శాలువాలు , శ్రీకాళహస్తి చెక్క విగ్రహాలు, జ్యూట్ బ్యాగ్లు, మట్టి కుండలు, మొదలైనవి అమ్మకానికి ప్రదర్శించడం జరుగుతుంది. ఈసారి రాష్ట్ర కళాకారులే కాకుండా విదేశాలలో నుండి భారతీయ కళలను నేర్చుకుంటున్న దుబాయ్, కెనడా, మొదలైన దేశాలనుండి కళాకారులూ పాల్గొంటున్నారు. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్ వారు వివిధ రాష్ట్రాల నుండి జానపద కళారూపాల ప్రదర్శనను ఏర్పాటు చేసారు. జంట నగరాల ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొని శిల్పారామం లో నిర్వహిస్తున్న ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ ను జయప్రదం చేయాలనీ కోరుతున్నాను.
Varun Tej Wishes Lavanya Tripathi: హ్యాపీ బర్త్‌డే బేబీ! అంటూ భార్యకు విషెస్ చెప్పిన వరుణ్ తేజ్