Kishan Reddy : మహిళలకు అనేక రకాల ఉపాధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం
- సికింద్రాబాద్‌లో పర్యటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- మహిళలకు ఉచితంగా 100 కుట్టు మిషన్లు పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్‌లో జేసిఐ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు ఉచితంగా 100 కుట్టు మిషన్ యంత్రాలను పంపిణీ చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 100 కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందని, గత కొన్నేండ్ల క్రితం నేను అంబర్ పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన స్కిల్ డెవలప్ సెంటర్లు.. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విస్తరించాయన్నారు. మహిళలకు అనేక రకాల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు వారి కాళ్ల మీద వారి నిలబడాలనే ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్లు అందజేస్తున్నామని, పేద, మధ్య తరగతి మహిళలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు మేము కృషి చేస్తున్నాం.
Allu Arjun: మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి అల్లు అర్జున్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
స్టార్టప్ లు, ముద్ర రుణాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. గ్రామీణ ప్రాంతంలో మహిళలకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇప్పించి.. వ్యవసాయంలో వాటిని వాడుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ‘డ్రోన్ దీదీ’ పేరిట కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 15 వేల గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద శిక్షణ ఇచ్చి 15 వేల డ్రోన్లు ఇచ్చాం. అన్ని బ్యాంకులకు కూడా మోదీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ముద్ర బ్యాంకు, స్వనిధి యోజన, స్వయం సహాయక సంఘాలకు లక్షల రూపాయల లోన్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. – మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు ఈ సమాజం బాగు పడుతుంది. ఆ దిశగా మేము చర్యలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
Swallows Set of Teeth : నిద్రలో పళ్ల సెట్ మింగేసిన వ్యక్తి.. ఆ తరువాత..!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!