Sandhya Theater Case : సంధ్య థియేటర్ ఘటన సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెయిల్‌పై ఉన్నారు. అయితే.. అల్లు అర్జున్ను ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మూడు గంటలకు పైగా విచారించారు. పోలీసులు, కట్టుదిట్టమైన భద్రతతో, సెషన్ తర్వాత నటుడిని తిరిగి అతని నివాసానికి తీసుకెళ్లారు. అల్లు అర్జున్ మీడియాకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. విచారణ ముగిసిన వెంటనే తన కారులో ప్రాంగణం […]
జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీ తొలి సమావేశం.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమిలి ఎన్నికల బిల్లు అధ్యయనంపై వేసిన జేపీసీ తొలి సమావేశం జనవరి 8వ తేదీన జరగనుంది. ఢిల్లీలోని పార్లమెంట్ అపెక్స్ బిల్డింగ్ లో ఉదయం 11గంటలకు భేటీ కానుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు-2024ను పార్లమెంట్ లభించింది. అయితే, ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఈ బిల్లుపై విస్తృత అధ్యయనం కోసం జేపీసీని ఏర్పాటు […]
Maoist Arrest : తెలంగాణలోని బీర్పూర్ గ్రామానికి చెందిన సీనియర్ నక్సలైట్ నాయకుడు, ప్రభాకర్‌గా ప్రసిద్ధి చెందిన బల్మూరి నారాయణరావును ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. నారాయణరావు నాలుగు దశాబ్దాలుగా అండర్‌గ్రౌండ్‌గా ఉన్నారు , సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా ఉన్న మరో అగ్ర నక్సల్ నాయకుడు ముప్పాల లక్ష్మణరావుకు దగ్గరి బంధువు. లక్ష్మణరావు కూడా బీర్పూర్ గ్రామానికి చెందినవాడు. అరెస్టయిన మావోయిస్టు నాయకుడు మావోయిస్టు పార్టీకి చెందిన మొబైల్ పొలిటికల్ స్కూల్ (మోపోస్) ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు, […]
Vishwak Sen : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల నటించిన చిత్రం “మెకానిక్ రాకీ” సక్సెస్ తరువాత, ఆయన నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం “లైలా”. ఈ చిత్రంలో విశ్వక్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా, ఒక పాత్రలో అమ్మాయిలా కనిపించనున్నారు. ఈ పాత్ర ఆయనకు చాలా ఛాలెంజింగ్ గా ఉందని సమాచారం. తాజాగా, “లైలా” సినిమా నుంచి మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ విడుదల […]
DK Aruna : సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజను బీజేపీ ఎంపీ డీకే. అరుణ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకుని, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన దురదృష్టకరమని, ఒకరి మరణం, మరొకరి తీవ్ర గాయపడడం బాధకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని, సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి […]
CP Avinash Mohanty : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అనువల్ రిపోర్ట్ – 2024ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. 37689 కేసులను ఈ ఏడాది రిజిస్టర్ చేశామని తెలిపారు. మొత్తం రిజిస్టర్ అయిన కేసుల్లో 32 శాతం సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. 70 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు రిఫండ్ చేసి ఇచ్చామని సీపీ మహంతి అన్నారు. ఎకనామిక్ […]
Mission Bhagiratha : పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్ ప్రారంభించారు. సోమవారం నుంచి మిషన్ భగీరథ టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4007 అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులపై ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. సూపరిండెంట్ ఇంజనీర్ నేతృత్వంలో ఐదుగురు సిబ్బందితో 24 గంటలు పనిచేయనున్న […]
CP Sudheer Babu : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక సూచనలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని, ఉల్లంఘనలకు దిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఏడాది రాచకొండ పోలీస్ శాఖ 253 డ్రగ్స్ కేసులు నమోదు చేసిందని, 521 నిందితులను అరెస్ట్ చేయడం ద్వారా […]
CHAKRASIDDH: గుండెపుడి గ్రామంలో ఉచిత సిద్ధ వైద్య శిబిరం. జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి గ్రామంలో చక్కర సిద్ధ ఆధ్వర్యంలో ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని డాక్టర్ సత్య సింధుజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాచీన వైద్య విధానాల ద్వారా ప్రజలకు వైద్యాన్ని అందించాలనే మంచి ఉద్దేశంతో గుండెపుడి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎటువంటి మందులు ఆపరేషన్ […]
Harish Rao : క్రిస్మస్ను అధికారికంగా నిర్వహించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ప్రతి క్రిస్మస్కు పేద క్రిస్టియన్ సోదరులకు గిఫ్ట్‌లు అందించడం ప్రత్యేకమైనది అని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులపై కేసీఆర్ చేసిన ప్రయత్నాలు, ఎంత బాగా చూసుకున్నారో అందరికీ తెలుసని చెప్పారు. మెదక్ చర్చి వందేండ్లు పూర్తి అవడాన్ని పురస్కరించుకుని హరీష్ రావు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన […]