Kishan Reddy : బీజేపీలో తరవాత అధ్యక్షుడు ఎవరో బీఆర్‌ఎస్ వాళ్ళు చెప్పగలరా.. బీఆర్‌ఎస్ నెక్ట్స్ ప్రెసిడెంట్ ఎవరో అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లో డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు జరుగుతాయి…. బీజేపీలో అలా కాదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ మండల అధ్యక్షులలో 50 శాతం పైగా బీసీ లు ఉన్నారని, సంస్థాగత ఎన్నికలు పూర్తి కాగానే ప్రజా సమస్యల పై పోరాటమన్నారు కిషన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ అని, స్థానిక ఇష్యూ ల ఎజెండా గానే ఎన్నికలకి వెళ్తామన్నారు కిషన్ రెడ్డి .స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ప్రజలకి వివరిస్తామని ఆయన వెల్లడించారు.
EPFO: పీఎఫ్‌లోని ఈ రూల్ ప్రకారం.. ఫ్రీగా రూ. 50 వేలు పొందే ఛాన్స్!
అంతేకాకుండా..’రేవంత్ రెడ్డి చెబితే డిల్లీలో ఓట్లు పడతాయా.. 6 గ్యారెంటీలని అమలు చేశామని అక్కడ చెబుతున్నారు. ఉచితాలకి బీజేపీ వ్యతిరేకం కాదు… రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు ఉండాలని అంటున్నాం.. 80 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తుంది… స్ట్రీట్ లైట్ ఫెయిల్ అయితే 7 నెలల నుండి హైదారాబాద్ లో కొత్త స్ట్రీట్ లైట్ వేయని పరిస్థితి… అమరావతి రాజధాని కి నిధులు ఇవ్వాలని రాష్ట్ర విభజన చట్టం లో ఉంది.. దాని ప్రకారమే కేంద్రం నడుచుకుంటుంది… టెక్స్టైల్ ప్రాజెక్ట్ , జహీరా బాద్ లో ఇండస్ట్రియల్ పార్క్ , పసుపు బోర్డు తెచ్చింది మేమే… రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది.. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు మా వల్లనే వచ్చిందని చెప్పుకుంటున్నారు… ఇవి గతం లోనే ప్రకటించాము.. మా వల్లనే వచ్చిందని అంటున్న వారినీ ఈడ్చి కొట్టాలి… బీర్, బ్రాండి కొన్న వారికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి… ఆ డబ్బులను కూడా డైవర్ట్ చేశారు…’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Rajamahendravaram: ఏపీలో అరుదైన వివాహం.. వధువుకు 68.. వరుడికి 64