CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో ఉన్న ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, 12:25 గంటలకు తిరిగి హెలికాప్టర్లో నారాయణపేట జిల్లా కేంద్రం సింగారంకు చేరుకుంటారు. సింగారన్లో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. […]
Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు పఖర్చు పెట్టిన ప్రాజెక్టు వాళ్ల హయాంలోనే కూలిపోయిందన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ..ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయన్నారు. కాళేశ్వరం కూలిపోయింది. పాలమూరు కింద ఒక్క ఎకరం ఆయకట్టు రాలేదని, సాగునీటి ప్రాజెక్టు ల విషయంలో పూర్తి వైఫల్యం చెందారని ఆయన మండిపడ్డారు. కృష్ణా వాటర్ లో తెలంగాణ కు అన్యాయం జరగొద్దని.. కేంద్రమంత్రి సీఆర్ […]
Kishan Reddy : యాదాద్రి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో మీట్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకుందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు అడిగే ధైర్యం లేకనే తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదన్నారు కిషన్ […]
Bandi Sanjay : హైదరాబాద్ లోని మెర్క్యురీ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈసారి కేంద్ర బడ్జెట్ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించామన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని, కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని కబోధులు కాంగ్రెస్ నేతలు అని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ బాటలోనే […]
Hyderabad Rain : హైదరాబాద్లో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు చోటుచేసుకుంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్ర ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో, ఒక్కసారిగా వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. ఈ మార్పుతో దిల్సుఖ్నగర్, కొత్తపేట, నాగోల్ వంటి ప్రాంతాల్లో వర్షపు జల్లు కురిసింది. అంతేకాకుండా, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని యాచారం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ తాజా ప్రకటన […]
DCP Vineeth : అంతరాష్ట్ర మహిళ డ్రగ్ పెడ్లర్ ను TGANB, సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూర్ కు చెందిన శతాబ్ది మన్నా ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద 6 లక్షల రూపాయల విలువ చేసే 60 గ్రాముల MDMA డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు ఆఫ్రికా కు చెందిన వారెన్ కొకరంగో పరారీ ఉన్నాడు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న […]
Konda Surekha : రంగారెడ్డి జిల్లా కన్ష శాంతి వనంలో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ఏర్పాటు చేసిన నేషనల్ బయోడైవర్సటీ కాన్ఫరెన్స్ -2025లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేషనల్ బయోడైవర్సటీ కాన్ఫరెన్స్ – 2025… ఫిబ్రవరి 20, 21, 22 తేదీలలో రంగారెడ్డిలో మూడు రోజుల పాటు జరగనుందన్నారు. దెబ్బతింటోన్న జీవవైవిధ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. మన పర్యావరణం, నీరు, భూ […]
Cockroach in Mutton Soup : రోజు రోజుకు హైదరాబాద్లో ఆహార పదార్థాల నాణ్యత తగ్గుతోంది. ఇప్పటికే గ్రేటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లను సీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని రెస్టారెంట్ల యాజమాన్యాల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా అహార పదార్థాల నాణ్యత లోపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లోని సైనిక్పురిలో ఉన్న అరేబియన్ మంది రెస్టారెంట్కు ఓ కస్టమర్ వెళ్లాడు. ఆకలి మీదున్న ఆ కస్టమర్ […]
Aadi Srinivas : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బరితెగించి ముందుకు పోతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ భవనంలో ప్రెస్ మీట్లో అధికారుల పట్ల వ్యాఖ్యలు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశామని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణ చేస్తున్నారని […]
TPCC Mahesh Goud : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ బీ. మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ చెప్పినంత మాత్రాన మా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయినట్లా?” అని ప్రశ్నించారు. ప్రజలు తమ వెంటే ఉన్నప్పుడు, కాంగ్రెస్ బలంగా కొనసాగుతున్న సమయంలో, గ్రాఫ్ తగ్గిపోతుందన్న అభిప్రాయం అసత్యమని ఖండించారు. ఫామ్ హౌజ్లో కూర్చొని పెన్ను, పేపర్ తీసుకుని గ్రాఫ్ గీస్తే, కాంగ్రెస్ […]