New Ration Cards : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కమిషనర్ శాసనాలు ఇవ్వడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అర్హులందరికీ అందుబాటులోకి రానివ్వాలని, ఈ ప్రక్రియ త్వరగా ప్రారంభించమని ఆయన్ని కోరారు. ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి తాజా ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ […]
CM Revanth Reddy : తెలంగాణలో ఇసుక అక్రమ రవాణా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సోమవారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఈ సమస్యపై సమగ్రంగా చర్చించారు. అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అణచివేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొనగా, ఇసుక రీచ్ల తనిఖీలు, అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వాహనాల […]
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. తమ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ రాయితీ అన్ని మార్గాలకు వర్తించదని, ప్రత్యేకంగా బెంగళూరు-హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే “మహాలక్ష్మి పథకం” అమలులో ఉంది. దీని కారణంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల […]
Harish Rao : తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏకపక్షంగా తరలించుకుంటూ తెలంగాణకు నష్టం కలిగిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిశ్చలంగా చూస్తుండటం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. హరీష్ రావు పేర్కొన్నట్టుగా, గత మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ రోజుకు 10వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తోంది. ఏడాది మొత్తంగా ఇది 646 టీఎంసీలకు చేరుకుంటుంది. […]
KTR : తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అపార్థం చేసుకోవడం దారుణమని, తాము ప్రజా సంక్షేమం కోసం చేసిన ఖర్చును అప్పుగా చిత్రీకరించడం అన్యాయమని మండిపడ్డారు. కేటీఆర్ తన బహిరంగ లేఖలో, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 65 ఏళ్లలో 14 ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేసినా, బీజేపీ ప్రభుత్వం కేవలం […]
ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. కుటుంబీకుల ఆందోళన విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు పాటుపడాల్సిన కొందరు ఉపాధ్యాయులు బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు తప్పులు చేస్తే సరిచేయాల్సిందిపోయి టీచర్లే తప్పుడు పనులకు పూనుకుంటున్నారు. కొందరి ఉపాధ్యాయుల ప్రవర్తన, ఉపాధ్యాయలోకానికే మాయని మచ్చగా మారింది. తాజాగా వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. విషయం తెలిసిన విద్యార్థిని కుటుంబ సభ్యులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. పూర్తి […]
Falcon : హైదరాబాద్ నగరాన్ని కుదిపేసే విధంగా మరో భారీ స్కామ్ వెలుగుచూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట కోట్లాది రూపాయలు మోసానికి పాల్పడిన ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ కావ్య నల్లూరి, ఫాల్కన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలును సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఫాల్కన్ సంస్థ చిన్న తరహా పెట్టుబడుల పేరుతో నిరుద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగస్తులను ఆకర్షించి దేశవ్యాప్తంగా వేలాదిమందిని మోసం చేసింది. ప్రముఖ సంస్థలు […]
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐఏఎస్ అధికారులు ఎంతో కట్టుదిట్టంగా పని చేసేవారని, కానీ ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత అధికారి వర్గం కేవలం ఏసీ గదుల్లోనే పరిమితం అయ్యారని, ప్రజలకు అందుబాటులో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐఏఎస్ […]
Murder : మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ఎదుట 44వ నెంబర్ జాతీయ రహదారిపై దారుణ హత్య. మేడ్చల్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న గన్యా కుమారుడు ఉమేష్(30) ను ఆయన చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి కత్తితో పొడిచి, చంపాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతుండడంపై విసిగిపోయిన చిన్న కుమారుడు హత్యకు పూనుకున్నట్టు సమాచారం. సీఐ సత్యనారాయణ, సిబ్బంది […]
Dharmapuri Arvind : హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించిన నిజామాబాద్ ఎంపీ డి. అర్వింద్ కుమార్, ఓల్డ్ సిటీలో కూడా ఇదే తీరుగా చర్యలు తీసుకోవాలా? అని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజమైన ధైర్యముంటే ఓల్డ్ సిటీలో అడుగుపెట్టగలరా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆదివారం నిజామాబాద్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ-ముస్లింలపై […]