నాగార్జున గారు.. చూశారా సర్ నా పర్ ఫార్మెన్స్.. దూకుడు సినిమాలో బ్రహ్మనందం చెప్పిన ఈ డైలాగ్.. అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు సేమ అదే తరహాలోనే జగన్మోహన్ రెడ్డి గారు.. చూశారా సర్ నా పర్ ఫార్మెన్స్ అంటున్నారు ఆ మాజీ ఎంపీ. ఎక్కడో సీమ నుంచి గుంటూరుకి వచ్చి ఆయన చూపించిన నటనను రాజకీయ నాయకులే కాదు…ప్రజలు కూడా చర్చించుకుంటున్నారా ? అధినేత దృష్టిలో పడటానికే ఆయన పాట్లు పడుతున్నారా ? క్యారెక్టర్లో […]
ఏపీ ముఖ్యమంత్రి చాలా క్లోజ్…అదే ఆయనకు రెండోసారి మంత్రయ్యేలా చేసింది. రాష్ట్ర మంత్రి అయినప్పటికీ…నియోజవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారా ? జిల్లా ఎమ్మెల్యేలంటే…ఆ సీనియర్ మంత్రి భయపడుతున్నారా ? ఇంతకీ ఎవరా మంత్రి…? ఎంటా నియోజకవర్గం ? పొంగూరు నారాయణ…విద్యావేత్తగా దేశంలో ఎంతో ప్రసిద్ధి. 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు…ఎమ్మెల్సీ పదవి ఇచ్చి….మంత్రిని చేశారు సీఎం చంద్రబాబు. కీలకమైన పురపాలక..పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలను అప్పగించారు. 2014 నుంచి 19 వరకూ మంత్రిగా పని చేశారు. ఆ […]
బీజేపీ, అన్నాడీఎంకే పొత్తును ప్రకటించిన అమిత్ షా.. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మాజీ సీఎం ఎడప్పాడి పళని స్వామి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో పళని స్వామి మాట్లాడుతూ.. రెండు […]
ఇన్నాళ్లు ఆ పదవులు చేసిన వాళ్ళు.. పెదవి విరిచారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కానీ…మనకు ఏముంది అని ఫీలింగ్. కానీ ఇప్పుడు ఆ పదవి కీలకం కాబోతుంది. అందుకే ఆశావహులు కూడా భారీ పెరుగుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ పదవులు కీలకమే. అది ఏఐసీసీ నుంచి వచ్చిన నాయకులే కీలకం…అన్నట్టు ఉంటుంది. Aicc కార్యదర్శులు… ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీలకు ఉన్న పవర్ ఎవరికి ఉండదు. అందుకే పార్టీలో ఎఐసిసి నేతలకు బాగా పలుకుబడి ఉంటుంది. […]
తెలుగు రాష్ట్రాల్లో…ఆ భూముల వ్యవహారంపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. పార్టీల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు గత చరిత్రను తవ్వుకుంటున్నారు. ఈ భూముల వ్యవహారంలో బీజేపీ నేత ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే…ఆ ఎంపీ ఎవరో చెప్పాలని కాషాయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలిలోని సెంట్రల్ వర్సిటీ భూముల రచ్చరచ్చ అవుతోంది. 400 ఎకరాల భూమి హెచ్‌సీయూకా? ప్రభుత్వానిదా? అనే వివాదం కొనసాగుతూనే ఉంది. 400 ఎకరాల స్కాం వెనుక బీజేపీ ఎంపీ […]
POCSO : నాంపల్లి లోని పోక్సో (POCSO) కోర్టు శుక్రవారం సంచలన తీర్పుని వెలువరించింది. 2023లో రాజ్‌భవన్ మక్త ప్రాంతంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌కు కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసు తీర్పు ప్రకటనతో బాధిత కుటుంబానికి న్యాయం లభించిందన్న భావన నెలకొంది. వివరాల ప్రకారం, 2023లో శ్రీనివాస్ అనే వ్యక్తి మైనర్ బాలికను సెల్‌ఫోన్ ఇస్తానని మాయ మాటలతో మభ్యపెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం […]
రాజకీయ నేతలు…ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. కాలు జారినా ఫర్వాలేదు…కానీ నోరు జారొద్దనేది నానుడి. అయితే బీఆర్ఎస్ సీనియర్ పొలిటిషియన్…మాత్రం ఓ డిప్యూటీ సీఎంపై టంగ్ స్లిప్పయ్యారు. అంతటితో ఆగని ఆమె…బై లక్ పదవి వచ్చిందంటూ కామెంట్ చేశారు. దీనిపై ఆ డిప్యూటీ సీఎం అభిమానులు, కార్యకర్తలు…అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు ? ఇంతకీ ఎవరా బీఆర్ఎస్ లీడర్ ? రాజకీయాల్లో నేతలు ఎవరైనా సరే…ఎంతటి స్థాయిలో ఉన్నా సరే…ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేసే అడుగులైనా…జనం ముందు […]
CM Revanth Reddy : ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎంతో పాటు సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, హైదరాబాద్ […]
ఏపీ బీజేపీ నేతలు వర్గాలుగా విడిపోయారా ? పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టేసి…ఆధిపత్యం కోసం ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారా ? మా టైం వచ్చిందని చెబుతున్నదెవరు ? ఆ సీనియర్ నేతకు పదవి రావడంతోనే…కమలం దళంలో చీలికలు వచ్చాయా ? ఇంతకీ ఎవరా నేతలు ? ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొత్త వివాదం మొదలైంది. నిన్న మొన్నటి దాకా…ఎలాంటి గ్రూపులు లేకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు పని చేశారు. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. రాష్ట్ర పార్టీ […]
TGTET 2025 : తెలంగాణ ప్రభుత్వం విద్యాభ్యాస లక్ష్యంగా ప్రతి ఏడాది నిర్వహించే టెట్ (Teacher Eligibility Test) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది ఎంతో కీలకమైన పరీక్ష. ఈ పరీక్ష ద్వారా పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించవచ్చు. ఈ ఏడాది టెట్ పరీక్షలు జూన్ 15 నుండి 30 మధ్య నిర్వహించనున్నారు. అధికారికంగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు […]