Minister Seethakka : ములుగు జిల్లా వెంకటాపూర్‌లో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కళ్లముందుంచుకుని పనిచేస్తుందని స్పష్టం చేశారు. పేదలకు నిత్యం తోడుగా నిలబడే సంకల్పంతోనే ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. పేదింటి బిడ్డలకు సన్నబియ్యం అందిస్తే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అసహనంతో రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. పేదల పట్ల ప్రభుత్వానికి […]
MMTS Train Case: హైదరాబాద్ లోని MMTS ట్రైన్లో అత్యాచారయత్నం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసు ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. ట్రైన్ లో యువతి పై జరిగినదన్న అత్యాచారం అబద్ధంగా తేలింది. ఈ కేసులో రైల్వే పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ట్రైన్ లోనుండి జారిపడిన యువతి, అనంతరం తనపై అత్యాచారం జరిగిందని కథ అల్లింది. ఆమె కథనాల […]
Damodara Raja Narasimha : ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో సిజేరియన్ డెలివరీలు అత్యధికంగా చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన సి-సెక్షన్ ఆడిట్‌ను మరింత కఠినంగా నిర్వహించాలని సూచించారు. గురువారం, కోఠీలోని టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, మంత్రి ప్రభుత్వ హాస్పిటల్స్‌లో నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నార్మల్ డెలివరీలు చేసే లాభాలను, […]
Online Betting : హైదరాబాద్ నగరంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు యువత జీవితాలను బలిగొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, అత్తాపూర్ రెడ్డి కాలనీలో మాసబ్ ట్యాంక్‌లోని జేఎన్టీయూ (JNTU)లో ఎం.టెక్ చదువుతున్న విద్యార్థి పవన్ (23) బెట్టింగ్ యాప్‌లలో భారీగా నష్టపోయి, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల కలిగే ప్రమాదాలను మరోసారి గుర్తు చేస్తోంది. అత్తాపూర్ రెడ్డి కాలనీలో నివాసముంటున్న పవన్, […]
తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్త భయం పట్టుకుందా? వాళ్ళు….. పార్టీ పెద్దల్ని టెన్షన్ పెడుతున్నారా? నిఖార్సయిన మాట మాట్లాడుకోవాలంటే… ముచ్చెమటలు పట్టిస్తున్నారా? ప్రతిపక్షం కామ్‌గా ఉన్న విషయాల్ని కూడా కెలికిపారేస్తున్నార్రా… బాబూ… మనమేం చేయాలి? ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటూ పసుపు ముఖ్యులు తలలు పట్టుకుంటున్నారా? ఇంతకీ… ఎవరు వాళ్ళు? వాళ్ళకు టీడీపీ అధిష్టానం ఎందుకు భయపడుతోంది? తెలుగుదేశం పార్టీకి ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుందట. మా పని మమ్మల్ని చేసుకోనివ్వడం లేదు. డేయ్…. ఎవర్రా మీరంతా అంటూ…. […]
కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు.. ప్రజా ప్రభుత్వం పైన కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర అయిలయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, కేటీఆర్ వెకిలి చేష్టలతో కాళ్లలో కట్టెలు పెట్టినట్లు మాట్లాడుతున్నాడని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో..లేకుంటే నాలుక కోస్తామని, అవినీతి డబ్బుతో పెట్టిన పింకీ మీడియా తో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేస్తున్నాడని, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చుతామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడని, రియల్టర్లు, బ్రోకర్లు, భూ స్కాం లు చేసిన వారు చందాలు […]
అక్కడ కూటమిలో కుంపట్లు రగులుకుంటున్నాయా? నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటని తెలుగుదేశం నాయకుల మీద జనసేన ఎమ్మెల్యే ఫైరై పోతున్నారా? అక్కడి టీడీపీ లీడర్స్ పరిస్థితి కూడా తేలుకుట్టిన దొంగల్లా అయిపోయిందా? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? ఏ విషయంలో తేడా కొట్టింది రెండు పార్టీల మధ్య? కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందా? అంటే…. వాతావరణం పూర్తిగా అలాగే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ […]
అక్కడ కారు ఫుల్ కండిషన్లో ఉందట. కానీ…. నడిపేందుకు డ్రైవర్ మాత్రం లేడు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారన్న ఎదురు చూపులతోనే సరిపోతోంది కేడర్‌కు. ప్రస్తుతానికి క్రైసిస్ టైం అయినా… భవిష్యత్ బాగుంటుందని కార్యకర్తలు నమ్మకంతో ఉంటే… వాళ్ళని నడపాల్సిన నాయకులు మాత్రం అడ్రస్లేరు. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎందుకలా జరుగుతుతోంది? నడిగడ్డ ప్రాంతంగా చెప్పుకునే గద్వాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపగా […]
Shabbir Ali : వక్ఫ్ బోర్డు, మతపరమైన సంస్థల నిర్వహణ, సామాజిక న్యాయంతో సంబంధం ఉన్న అంశాలపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నుంచి తమ పిటిషన్లపై లభించిన సానుకూల తీర్పును స్వాగతించారు. ఈ తీర్పు తమకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా, ప్రజల్లో న్యాయం పట్ల నమ్మకాన్ని పెంచిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తమ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పును ప్రశంసించారు. “జడ్జిలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కోర్టు […]
మనం సీన్లో అన్నా ఉండాలి, లేదా సినిమా మొత్తం మన చుట్టూనే తిరుగుతూ ఉండాలని ఆ సీనియర్ ఐఎఎస్ అనుకుంటున్నారా? అందుకే అనవసరమైన వివాదాల్ని కెలుక్కుని మరీ తెర మీద ఉండే ప్రయత్నం చేస్తున్నారా? ప్రతి సందర్భంలో ఆమె అత్యుత్సాహం ఏదో ఒక వివాదానికి దారి తీస్తోందా? తన పోస్ట్‌కు తగ్గ హుందాతనాన్ని ప్రదర్శించడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న ఆ ఐఎఎస్ ఎవరు? ఏంటా వ్యవహారం? స్మితా సభర్వాల్…. సీనియర్ ఐఏఎస్. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు […]