Pavala Shyamala: టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pavala Shyamala: తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “పావలా శ్యామల” కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జూలై 28 తెల్లవారుజామున సుమారు 1:52 గంటలకు ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు గతంలో సహాయం అందించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇదిలా ఉండగా.. ఆమెతో కలిసి నివసిస్తున్న కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు తన హాస్యభరితమైన, సహజమైన నటనతో వెండితెరపై ప్రేక్షకులను అలరించిన పావలా శ్యామల, చివరి రోజుల్లో ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో కన్నుమూయడం సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. పావలా శ్యామల మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!