Viral : ఐస్‌క్రీమ్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ఈ వేసవిలో అది ఒక హాయిని, ఆనందాన్నిచ్చే తియ్యటి పదార్థం. రకరకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొందరు ఐస్‌క్రీమ్‌లను కారం లేదా వేడి వంటకాలతో కలిపి తింటున్నారు. ఇలాంటి అనేక వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా, సోషల్ మీడియాలో ఐస్‌క్రీమ్‌తో ఆలూగడ్డ ఫ్రైస్ వేసుకొని తింటున్న వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది. ఇది నిజంగా విచిత్రమైన […]
Obulapuram Mining Case : అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (ఓఎంసీ) కేసులో కీలక మలుపు వచ్చింది. హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ కేసులో తుది తీర్పు వెలువరించనుంది. ఈ కేసు దాదాపు 15 ఏళ్లుగా నడుస్తూ వస్తోంది. 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించింది. 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలైంది. అనంతరం మిగతా నిందితులపై అనుబంధ అభియోగ పత్రాలు దాఖలయ్యాయి. మొత్తం […]
Tragedy : ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిన హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతుండగా వధువు మరణించింది. తన హల్దీ వేడుకలో నృత్యం చేస్తూ ఉండగా, బాత్రూమ్కు వెళ్లిన 22 ఏళ్ల యువతి గుండెపోటుతో మృతి చెందింది. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి బాత్రూమ్లో ప్రాణాలు విడిచింది. ఈ వేడుకలో యువతి నృత్యం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషాదకర సంఘటన ఆదివారం (మే 4) రాత్రి […]
TGSRTC : తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించి, సమ్మె నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సంస్థ అభివృద్ధి మార్గంలో పయనిస్తున్న సమయంలో సమ్మె అనేది తీరని నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. యాజమాన్యం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంది. 2019లో జరిగిన సమ్మె సంస్థను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయగా, […]
No Phones : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. రూరల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కొన్ని సందర్భాల్లో టీచర్లు తరగతులు నిర్వహించకుండా ఫోన్లలో మునిగిపోయారని స్థానిక ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు డీఈఓలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితులు పాఠశాలలపై నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉండటంతో, అడ్మిషన్లపై దుష్ప్రభావం పడే అవకాశాన్ని విద్యాశాఖ ఆందోళనగా చూస్తోంది. Ram Charan : రామ్ చరణ్ కి అరుదైన […]
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలను పెంచే అవకాశాలపై తాజాగా సంకేతాలు వెలువడ్డాయి. మెట్రో వర్గాల సమాచారం ప్రకారం, మే రెండో వారంలో సవరించిన టికెట్ రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ గ్రూప్ ఛైర్మన్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన భారత్‌కు చేరిన తర్వాతే ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ ఈ టారిఫ్ సవరణలతో […]
నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్న వైఎస్ జగన్. ఇవాళ మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరనున్న జగన్. IPL: నేడు ముంబయి ఇండియన్స్ Vs గుజరాత్ టైటాన్స్. ముంబయి వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్. నేడు సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం. హాజరుకానున్న మంత్రులు నారాయణ, పయ్యావుల, సీఆర్డీఏ కమిషనర్, అధికారులు. రాజధాని పరిధిలో చేపట్టాల్సిన మరికొన్ని పనులకు అనుమతి ఇవ్వనున్న సీఆర్డీఏ అథారిటీ. […]
Fire Accident : సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్యాట్నీ సెంటర్లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్ ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు బిల్డింగ్ అంతటా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు , స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు సంఘటన […]
ఇజ్రాయిల్ అతిపెద్ద ఎయిర్‌పోర్టుపై హౌతీ క్షిపణి దాడి.. వైరల్ అవుతున్న వీడియో.. హౌతీ ఉగ్రవాదులు ఆదివారం రోజు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సై్ల్‌తో దాడి చేశారు. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపైకి మిస్సైల్‌ని ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇజ్రాయిల్‌కి ఉన్న బలమైన 4 […]