Bathukamma Kunta : హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతంలో ఉన్న బతుకమ్మ కుంటపై జరుగుతున్న అక్రమ కబ్జాలు అడ్డుకోగలిగిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్)కి హైకోర్టు విజయాన్ని అందించింది. ఎన్నో ఏళ్లుగా దాదాపు 20 ఎకరాల పైచిలుకు ఉన్న ఈ కుంట, క్రమంగా కబ్జాల బారిన పడి కనుమరుగవుతోంది. ప్రస్తుతం ఇందులో కేవలం 6 ఎకరాల కుంటే మిగిలి ఉండగా, హైడ్రా ప్రత్యేక చర్యలతో ఈ భాగాన్ని పునరుద్ధరించగలిగింది.
Prasanna Kumar Reddy: నా ఇంటిని టీడీపీ నేతలే విధ్వంసం చేశారు.. ప్రతి విమర్శకు నేను కట్టుబడి ఉన్నా..!
ఈ క్రమంలో, ఆ స్థలంపై హక్కులున్నాయంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. కుంట భూమిపై ఆయన్ను హక్కుదారుడిగా గుర్తించలేమని స్పష్టం చేస్తూ, బతుకమ్మ కుంట స్థలంగానే కొనసాగించాలని స్పష్టమైన తీర్పును వెలువరించింది. ‘అగ్రిమెంట్ ఆఫ్ సేల్’ ఆధారంగా తాను భూమి యజమానినని చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది.
బతుకమ్మ కుంటను రక్షించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు హైడ్రాకు పత్రాలు అందజేయడంతో, కమిషనర్ రంగనాథ్ స్వయంగా నవంబర్ 13న కుంటను పరిశీలించి పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశారు. దీని వల్ల మొదట్లో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, విచారణ అనంతరం తుది తీర్పు హైడ్రా పక్షాన పడింది.
ఈ నేపథ్యంలో రంగనాథ్ స్పందిస్తూ, “బతుకమ్మ కుంటకు పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యం. అక్కడ ప్రస్తుతం నివసిస్తున్న వారికి ఇబ్బంది లేకుండా తవ్వకాలు, అభివృద్ధి పనులు జరుగుతాయి,” అని అన్నారు. విజయానికి తోడ్పడిన ఉద్యోగులను హైడ్రా కార్యాలయంలో సన్మానించారు. ప్రస్తుతం పునరుద్ధరించిన ప్రాంతాన్ని పార్క్‌గా అభివృద్ధి చేయడం జరుగుతోంది. చెరువులపై కబ్జాలను అడ్డుకోవడంలో హైడ్రా కొనసాగిస్తున్న చొరవ, ఈ తీర్పుతో మరింత బలపడింది.
Floods: నేపాల్-చైనా బోర్డర్‌లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన పోలీసులు, 200 వాహనాలు