నేడు కొణిదెల గ్రామానికి పవన్ కళ్యాణ్.. సొంత నిధులతో..! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామానికి వెళ్లనున్నారు. కొణిదెల గ్రామంలో పవన్ తన సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలతో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కొణిదెల గ్రామ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పవన్ […]
Tejeshwar Murder : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన తేజేశ్వర్ హత్యకేసులో అసలు కథ బయటపడింది. ఈ కేసుపై గద్వాల జిల్లా ఎస్పీ ఒక ప్రెస్‌మీట్ నిర్వహించి నిందితుల కుట్రను బహిర్గతం చేశారు. తేజేశ్వర్ హత్య వెనుక ఉన్న ప్రేమ, ద్వేషం, కుట్రలను ఎస్పీ వివరించారు. బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఐశ్వర్యను పెళ్లి చేసుకునేందుకు ఆమె కుటుంబం తేజేశ్వర్‌తో ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో […]
Telangana : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌గా ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ చేసింది. మొత్తంగా రూ.180.38 కోట్ల బిల్లులు విడుదల చేయడం ద్వారా దాదాపు 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల […]
Minister Seethakka : తెలంగాణలో డ్రగ్స్ వ్యసనం రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో, నేషనల్ ఆంటీ డ్రగ్స్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అనే వ్యాధి యువతను భయంకరంగా పీడిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే వినిపించే సమస్య. ఇప్పుడు మాత్రం స్కూల్ల దాకా ప్రవేశించింది. చాక్లెట్లు, బిస్కెట్లు రూపంలో పిల్లలకు చేరుతోంది. ఇది […]
Shocking : సోషల్ మీడియాలో ఓ మహిళ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతిరోజూ ఉదయం తన కళ్లను సొంత మూత్రంతో కడిగుకుంటానంటూ ఓ వీడియో పెట్టింది. ‘యూరిన్ ఐ వాష్ – నేచురల్ మెడిసిన్’ అంటూ క్యాప్షన్ కూడా జతచేసింది. దీంతో వీడియో వైరల్ అయింది. అయితే నెటిజన్లు, వైద్య నిపుణులు మాత్రం మండిపడుతున్నారు. నుపుర్ పిట్టీ అనే మహిళ తనను ‘మెడిసిన్-ఫ్రీ లైఫ్ కోచ్’గా చెప్పుకుంటోంది. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ […]
MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. బోనాల పండుగను పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇప్పటివరకు 18 నెలల్లో రెండు లక్షల కోట్ల అప్పులు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. అయినా రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మొదలవ్వలేదు. కేసీఆర్ హయంలో తీసుకున్న అప్పులకు […]
రిషబ్ పంత్‌కు కెరీర్ ఉత్తమ ర్యాంకు! ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పురోగతి సాధించాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ కెరీర్ ఉత్తమ ర్యాంకు అందుకున్నాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని.. ఏడో స్థానంలో నిలిచాడు. లీడ్స్ టెస్ట్‌లో పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 134, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో […]
Storyboard : తెలుగు రాష్ట్రాలు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 153కు పెరిగే అవకాశాలున్నాయి. దేశంలో జన గణన 2027కి పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల శాసన […]
Vimal Bags : సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో పలువురు విదేశీయులు తమ భుజాలపై ప్రముఖ అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లైన గుచ్చీ, ప్రాడా వంటి బ్యాగులకు బదులుగా, భారతదేశంలో నిత్యం కనిపించే “విమల్” బ్రాండ్ ప్లాస్టిక్ బ్యాగులను ధరించి స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్నారు. సాధారణంగా విదేశీయులు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడి హస్తకళలు, సాంప్రదాయ వస్త్రాలు లేదా బ్రాండెడ్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. Akhanda Godavari Project: […]
Accident : సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌లోని దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, ఆ ప్రాంతంలో నిలిచివున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఎస్ఐ అశోక్ , కానిస్టేబుల్ స్వామిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వారు కారు ప్రయాణిస్తున్నారు. Coolie […]