Balmuri Venkat : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వివిధ ఆరోపణలు చేస్తూ కేటీఆర్‌ను బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.
“కేటీఆర్ కంటే నేను గట్టిగా తిట్టగలుగుతా. కేదర్‌తో మాకు సంబంధం లేదంటున్నావు. కానీ కేదర్‌కి డ్రివెన్ కంపెనీ ఉంది. నీ బామ్మర్ది రాజ్ పాకాల వాడే కారు కేదర్ కంపెనీ పేరుతో ఉంది. సంబంధం లేకుంటే కేదర్ కంపెనీ కారును ఎందుకు వాడుతున్నాడు?” అని బల్మూరి వెంకట్ ప్రశ్నించారు.
అలాగే, “డ్రగ్స్ కేసులో కోర్టు చెప్పింది ఒకటి, నువ్వు వక్రీకరించింది ఇంకొకటి. ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు వెళ్తా” అని హెచ్చరించారు.
Crime: మరీ ఇంత దారుణమా? మద్యం మత్తులో తల్లిదండ్రులను అతికిరాతకంగా చంపిన కొడుకు..
బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, “డ్రగ్స్ టెస్టులో బయట పడకుండా డిటాక్స్ చేసుకుని వచ్చావు కేటీఆర్. మూడు నెలల క్రితం UK కి వెళ్లి చేసింది ఇదే. UK కి ఎందుకు వెళ్ళావు? ఏం టెస్టులు చేయించావు అని చెప్పు” అని నిలదీశారు.
కేదర్ మరణంపై మాట్లాడుతూ, “కేదర్ చనిపోయినప్పుడు మాజీ ఎమ్మెల్యేలు లేరా? సిఎం చెప్పింది అబద్ధమైతే, కేటీఆర్ నువ్వు లేఖ రాసి విచారణ కోరాలి. నేను కూడా సిఎంకి లేఖ రాస్తా. విచారణకి సిద్ధమా?” అని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా బల్మూరి వెంకట్ సవాల్ చేశారు. “ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదు అంటున్నావు. కేటీఆర్, కేసీఆర్ – లై డిటెక్టర్ టెస్ట్ కి వస్తారా? బహిరంగ చర్చకు రా కేటీఆర్. నీ కంటే నా ప్రోటోకాల్ పెద్దది. నేను చెప్పిన అంశాలపై చర్చకు రావాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ‘ఎందిరా కేటీఆర్’ అనాల్సి వస్తుంది. ఇవాళ్టి నుండి కేటీఆర్ ప్రవర్తన ఎలా ఉంటే, మా ప్రవర్తన అట్లానే ఉంటుంది” అని బల్మూరి వెంకట్ హెచ్చరించారు.
Non Veg Milk: ‘నాన్ వెజ్ మిల్క్’ అంటే ఏంటి..? అమెరికాతో ఆ గొడవేంటి..?