Kishan Reddy : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చే ప్రాజెక్టులను ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వరంగల్, ఖాజీపేట అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కలను సాకారం చేశాం. వ్యాగన్ తయారీ, కోచ్‌ల తయారీ, ఓవర్ హాలింగ్ కోసం మూడు యూనిట్లు మంజూరు చేశాం. దీని ద్వారా 3వేల మందికి నేరుగా ఉపాధి కలుగుతుంది. ఓరుగల్లు అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు కేటాయించింది. మోడీ గ్యారంటీ అంటే తప్పకుండా నెరవేరుతుంది” అని అన్నారు.
Crime: మరీ ఇంత దారుణమా? మద్యం మత్తులో తల్లిదండ్రులను అతికిరాతకంగా చంపిన కొడుకు..
అలాగే, “వేయి స్తంభాల మంటపం, రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేశాం. త్వరలో వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ కూడా వస్తుంది. మోడీ వరంగల్‌కు ఏం ఇచ్చారో వరంగల్‌కి వచ్చి చూసి మాట్లాడాలి. వరంగల్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీ ఎల్లప్పుడూ కమిట్మెంట్‌తో ఉంది” అని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, “ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్ల కల. ప్రధానమంత్రి మోడీ ఆ కలను సాకారం చేశారు. డిసెంబర్ నాటికి సివిల్ కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది. 2026లో మాన్యుఫాక్చరింగ్ ప్రారంభమవుతుంది. ఇంజన్లు, బోగీలు, మెట్రో ట్రైన్స్ తయారీ జరగనుంది. దేశంలో అతి పెద్ద మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిలుస్తుంది” అని తెలిపారు.
మోడీ ప్రభుత్వం తెలంగాణలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, పరిశ్రమల విస్తరణ, రవాణా, రైల్వే సదుపాయాల మెరుగుదలకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని ఇద్దరు మంత్రులు హామీ ఇచ్చారు.
Mythri Movie Makers: క్రికెట్ టీం అనౌన్స్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్