జగన్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆత్మకూరు లో ముందస్తు ప్రణాళికతో దాడి చేశారని, ప్రజా వ్యతిరేక విధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఎమ్మెల్యే శిల్ప, హఫీజ్ ఖాన్, డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్ కుట్రదారులుగా ఆయన అభివర్ణించారు. ఆత్మకూరులో మసీదు నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకించారని, ముస్లింలు మెజారిటీ ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మిస్తామంటే ఓర్చుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. స్థానికులు ఒప్పుకుంటేనే మందిరం, మసీదు, చర్చి నిర్మించాలని హితవు పలికారు.
మసీదు నిర్మాణంపై స్టే ఉంది…కుట్ర చేసి ఎమ్మెల్యే శిల్ప మసీదు నిర్మించమని చెప్పారు. మసీదు నిర్మించండి…ఎవరేమి చేస్తారో చూస్తానని ఎమ్మెల్యే శిల్ప చెప్పారు. శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో ముస్లింలు వ్యాపారాన్ని బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డి అడ్డుకున్నారని గుర్తు చేశారు. శ్రీకాంత్ రెడ్డి హిందూ సమాజం కోసం పోరాడితే కేసులు పెట్టారని ఆరోపించారు. ఆత్మకూరు ఘటనలో వీడియో లు చుస్తే భయానకంగా ఉన్నాయని, ఏపీ లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి…కేరళలో ఉన్న పరిస్థితులు ఏపీ లో రాబోతున్నాయని ఆయన జ్యోస్యం చెప్పారు.