ఉరుకుల పరుగుల హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలి కొంచెం కష్టమే. అయితే ఉదయాన్నే పచ్చటి వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, యోగా లాంటివి చేయడానికి ఉస్మానియా యూనివర్సీటీ పరిసరాల ప్రజలు ఓయూ క్యాంపస్‌ను వినియోగించుకుంటుంటారు. అయితే ఇలా తార్నాక, డీడీ కాలనీ, విద్యా నగర్, మాణికేశ్వర్ నగర్, అడిక్‌మెట్, హబ్సిగూడ, అంబర్‌పేట్‌తో సహా ఓయూ పరిసర ప్రాంతాల నుండి అనేక వందల మంది ప్రజలకు, క్యాంపస్‌లో వాకింగ్, రన్నింగ్, జాగింగ్‌తో పాటు యోగా వంటి […]
వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాసారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ. 6054 కోట్ల నష్టం వాటిల్లితే.. కేవలం రూ. 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేయడం సరైవ పద్దతి కాదని, ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన రూ. 1100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కాగ్ తప్పు పట్టిందన్నారు. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహాణ నిబంధనలకు విరుద్దంగా […]
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు పార్లమెంటీరీ సమావేశాలు నిర్వహించుకుంటూ సమావేశాల్లో ప్రత్యర్థులపైన పన్నాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బేజేపీ కూడా పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ నేతలు ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా విపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు. దీనితో పాటు సాయంత్రం 5గంటలకు రాజ్యసభ […]
కోవిడ్ ధాటికి ప్రపంప దేశాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి కోలుకుంటున్న వేళ మరో వేరియంట్ వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అయితే ఇప్పటికే తయారు చేసి పంపిణీ చేస్తోన్న కోవిడ్ కోవిడ్ టీకా ఈ వేరియంట్‌ను ఎదుర్కొగలదా అని ఆయా దేశాల శాస్త్రవేత్తలు తేల్చే పనిలో పడ్డారు. అయితే తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా కొత్త వేరియంట్ వ్యాప్తిపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై […]
కరోనా మహహ్మరి కొత్త రూపాంతరం చెందుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కోవిడ్ కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఇప్పుడు దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ఇజ్రాయెల్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో 14 రోజుల పాటు విదేశీయులను దేశంలోకి రాకుండా, కొత్త కోవిడ్ వేరియంట్ ఓమిక్రాన్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా విదేశాల నుంచి విమాన ప్రయాణాలను రద్దు ప్రకటించనుంది. […]
ఎన్టీఆర్ పార్క్ ముందు కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్ అనే ముగ్గురు యువకులు ఉదయం టిఫిన్ చేసేందుకు ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్ బయలుదేరారు. అయితే అతివేగంగా కారు నడుపుతుండగా ఎన్టీఆర్ పార్క్ ముందు అదుపుతప్పి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై సమాచారం అందిన సైఫాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు […]
ఏపీని వర్షాలు వదలనంటున్నాయి. మొన్నటి వరకు కురిసిన వర్షాలతోనే ఏపీలో వాగులు, వంకలు నిండి పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. అయితే తాజాగా అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడడంతో మరోసారి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షా పడుతోంది. అయితే వెంకటగిరి, కోవూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి మోస్తరుగా, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాలలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. […]
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ చేస్తోన్న నవంబర్ 1న ప్రారంభమైంది. అయితే 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర డిసెంబర్ 15న తిరుమలకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో నేడు 28 రోజు మహాపాదయాత్రకు బ్రేక్ పడింది. Also Read : యువతిని మోసం చేసిన ఉగాండా ఉన్మాది.. రఫ్ఫాడించిన పోలీసులు భారీ వర్షాల దృష్ట్యా పాదయాత్రకు ఈ రోజు విరామం ఇస్తున్నట్లు […]
ఓ యువతిని మోసం చేసిన ఉగాండా వ్యక్తిని పోలీసులు సినీఫక్కీలో అరెస్టు చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా నగరి మండలం నంబాకం గ్రామానికి చెందిన ఓ యువతికి ఉగాండాకు చెందిన “నెల్సన్ హోగ్లర్ అలియాస్ జాన్” అనే వ్యక్తి ఫోన్ చేసి ఆన్లైన్ లాటరీలో రూ2.5 కోట్ల వచ్చాయని నమ్మించాడు. ఈ నేపథ్యంలో లాటరీ డబ్బులు రావాలంటే ట్యాక్స్‌లు కట్టాలంటూ సదరు యువతి నుంచి మొదట రూ.3.5 వేలు, తర్వాత రూ.12.5 […]
కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. కోవిడ్‌తో ఇప్పటికే యావత్తు ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. కోవిడ్ డేల్టా వేరియంట్‌తోనే పలు దేశాలు కుస్తీ పడుతున్న నేపథ్యంలో మరో కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ఇది ఇప్పుడు వేగంగా దేశాలను చుట్టేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. Also Read : What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..? తాజాగా దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ (B111529) బ్రిటన్, ఇటలీ దేశాలకు వ్యాపించింది. ఈ నేపథ్యంలో […]