ఢిల్లీ ఎయిర్ పోర్టులో “వీడొక్కడే” సీన్ రిపీట్.. కానీ.. కిలేడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో సూర్య నటించిన “వీడొక్కడే” సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో హెరాయిన్ స్మగ్లింగ్ చేసేందుకు హీరో సూర్య స్నేహితుడు చేసిన విధంగానే ఓ మహిళ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంది.. వివరాల్లోకి వెళితే.. ఉగాండా దేశానికి చెందిన ఓ మహిళ ఢిల్లీ ఐ పోర్టుకు చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ లో సదరు ప్రయాణికురాలి పై అనుమానం కలగడంతో కస్టమ్స్ బృందం అదుపులోకి తీసుకొని విచారణ చేసింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను క్యాప్ సెల్స్ లో నింపి నల్లటి కవర్ లో చుట్టి హ్యాండ్ బ్యాగ్ లో దాచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. హ్యాండ్ బ్యాగ్ లో దాచిన హెరాయిన్ గుట్టును అధికారులు రట్టు చేశారు.
అయితే సదరు మహిళ అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హెరాయిన్ తో నింపబడిన 38 క్యాప్ సెల్స్ మింగినట్లు ఆ మహిళ కస్టమ్స్ అధికారులకు వెల్లడించింది. దీంతో 3 రోజుల శస్త్రచికిత్స అనంతరం కడుపులో దాచిన 38 క్యాప్ సెల్స్ తో నింపబడిన హెరాయిన్ ను వైద్యులు బయటకు తీశారు. ప్రాణాలకు తెగించి హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికురాలిని వైద్యులు ప్రాణాలతో కాపాడారు. ఆమె వద్ద 7 కోట్ల విలువ చేసే 1 కేజీ హెరాయిన్ ను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.. ప్రయాణికురాలి పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ను ఢిల్లీ లో ఎవరికి అందిస్తుంది అనే సమాచారాన్ని కస్టమ్స్ బృందం స్వేకరిస్తోంది.
Also Read
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- RSS: ఆర్ఎస్ఎస్, హిజ్బుల్ ముజాహిదీన్ ఒకటే.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
తాజావార్తలు
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!