డ్రగ్స్ కేసులో నైజిరియాకు చెందిన టోనీని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టులు టోనీకి రిమాండ్ విధించింది. అయితే ఇప్పటికే ఈ డ్రగ్ కేసులో ప్రముఖ వ్యాపార వేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. టోనీ కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొందరి పేర్లు బయటకు రావచ్చనే ఉద్దేశ్యంతో పోలీసులు టోనీని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే టోనీ రెండో రోజు కస్టడి విచారణ లో పలు కీలక విషయాలు టాస్క్ ఫోర్స్ పోలీసులు రాబట్టారు. టోనికి హైదరాబాదులోని వ్యాపారులతో సంబంధం ఎలా ఏర్పడిందనే వివరాలను పోలీసులు సేకరించారు. వ్యాపారవేత్త శాశ్విత్ జైన్ ద్వారా హైదరాబాద్ లో ఉన్న వ్యాపారులను టోనీ పరిచయం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ముంబైలో జరిగిన ఒక పార్టీలో పాల్గొని టోనీ తో శాశ్విత్ జైన్ పరిచయం పెంచుకున్నాడు.
హైదరాబాద్ కు డ్రగ్స్ పంపించమని టోనీని కోరాడు..తనతో పాటు చాలామంది వ్యాపారవేత్తలు డ్రగ్స్ కొనుగోలు చేస్తారంటూ టోనీ కి శాశ్విత్ జైన్ పరిచయం చేసాడు. కొంతమంది వ్యాపారవేత్తలు ముంబైలో టోనీ నేరుగా కలిసినట్టు పోలీసుల విచారణ లో చెప్పాడు. శాశ్విత్ జైన్ చంచల్ గూడ జైల్ లో ఉన్నాడు.. అరెస్టయిన ఏడు మందిలో A11 గా ఉన్న శాశ్విత్ జైన్.. హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ బిసినెస్ చేస్తున్నాడు.. జనవరి 6న టోనీ అనుచరులు హైదరాబాద్ పోలీసులకు పట్టుబడినట్లు తెలియడంతో తన సెల్ ఫోన్ లో ఉన్న వ్యాపారవేత్తలకు సంబంధించిన సమాచారాన్ని డిలీట్ చేశాడు. టోనీ కి సంబంధించిన 3 బ్యాంకు అకౌంట్స్ ను పోలీసులు గుర్తించారు. అయితే నేడు మూడో రోజు మరోసారి పోలీసులు టోనీని విచారించనున్నారు.