ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని కూడా జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ బాలకృష్ణ నిరసనకు దిగారు.. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురం ను జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా తూముకుంట పారిశ్రామిక వాడ లో పరిశ్రమలు ఉన్నాయని, హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి, సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన […]
ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి తరలివచ్చారు. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా చలో విజయవాడ కార్యక్రమానికి రాకుండా ఎక్కడి వారిని అక్కడే పోలీసులు నిర్బంధించారు. అయితే ఉద్యోగులు మారువేషాల్లో పోలీసుల కళ్ళు గప్పి విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్బంగా నేడు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఛలో విజయవాడ విజయవంతమైందని ఆయన అన్నారు. ఉద్యోగులు […]
మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హపూర్- ఘజియాబాద్ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ‘చిజారసీ టోల్‌ప్లాజా వద్ద నా కారుపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ముగ్గురు, నలుగురు దుండగులు కాల్పులు జరిపి, ఆయుధాలు వదిలేసి పరారయ్యారు. కారు […]
పాతబస్తీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఒవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. యూపీలో అసదుద్దీన్ ఒవైసీపై జరిపిన కాల్పుల నేపథ్యంలో పాతబస్తీ లో టెన్షన్ నెలకొంది. […]
హిడ్మా టార్గెట్ గా ఛత్తీస్ ఘడ్, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. హిడ్మా లోంగిపోయాడంటు పోలీసులు ఓ ప్లాన్ ప్రకారం ప్రచారం చేస్తున్నారని మావోయిస్ట్ పార్టీ అంటుంటే.. అలా చేయాల్సిన అవసరం తమకు లేదంటున్న పోలీసులు వెల్లడిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రెండు రాష్ట్రాల్లో హిడ్మా లోంగిపోయారంటు వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏమి జరుగుతుందేమోనని మావోయిస్ట్ పార్టీలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇటీవలే మావోయిస్ట్ పార్టీ మిలిషియస్ సభ్యుడు మాడవి హిడ్మా లొంగిపోయాడు. […]
విశాఖపట్నంలో పప్పుల చిట్టీ స్కామ్ లో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి సబ్బేళ్ల రామారెడ్డిని అదుపులోకి తీసుకుని బుచ్చయ్యపేట పోలీసులు విచారిస్తున్నారు. సంక్రాంతికి వంట సరుకుల పేరుతో చిట్టీల వ్యాపారం చేసిన ఎలియాబాబు అలియాస్ రవి.. చోడవరం,నర్సీపట్నం ఏరియాల్లో ఏడు వేల మందికి పైగా ఖాతాదారుల వద్ద నుండి సుమారు ఐదు కోట్లు వసూళ్లకు పాల్పడ్డాడు. ఎలియాబాబు, రామారెడ్డి నిందితులుగా తేల్చిన పోలీసులు…ఇప్పటికే ఎలియాబాబు అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లో హార్స్ […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు సతీసమేతంగా దర్శించుకున్నారు. రఘునందన్ రావు దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాన్నిఆలయ అర్చకులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటిఆర్ నువ్వు సిరిసిల్ల, వేములవాడ రెండు కళ్ళు అన్నావ్, సిరిసిల్ల కి ఎన్ని నిధులు పోయాయి..వేములవాడ కి ఎన్ని నిధులు ఇచ్చారని ఆయన అన్నారు. అంతేకాకుండా వేములవాడ […]
భారత రాజ్యాంగాన్ని తిరగరాయడంపై తాను చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు గురువారం అల్టిమేటం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం దళితుల కుటుంబానికి 10 లక్షలు ఇస్తుందని చెప్పారు. వారు అణగారిన వారు మరియు సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నందున అతను ఇస్తున్నాడు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించారు. […]
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నారు పెద్దలు. అదే తీరున నాటి మేటి నటి మీనాకుమారి, ఆమె భర్త కమల్ ఆమ్రోహి తమ పాకీజా చిత్రం గురించి ఎన్నెన్నో అనుకున్నారు. అయితే ఆ సినిమా ఏ ముహూర్తాన మొదలయ్యిందో కానీ, పలు బాలారిష్టాలు ఎదుర్కొని చివరకు 1972 ఫిబ్రవరి 4న జనం ముందు నిలచింది. 1956లో షూటింగ్ మొదలు పెట్టుకున్న పాకీజా దాదాపు 16 ఏళ్ళ తరువాత ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా విడుదలైన […]
సినిమారంగాన్ని నమ్ముకుంటే ఏ నాడూ మన నమ్మకాన్ని వమ్ము చేయదని అంటారు. అలా సక్సెస్ చూసిన వారెందరో ఉన్నారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏ.యమ్.రత్నం సినిమా తల్లి వంటిది. బిడ్డలను ఎప్పుడూ కాపాడుతుంది అంటూ ఉంటారు. మేకప్ మేన్ గా, నిర్మాతగా, దర్శకునిగా తనదైన బాణీ పలికించిన ఏ.యమ్.రత్నం ఇప్పటికీ జనానికి వైవిధ్యం అందించాలనే తపనతోనే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం నిర్మిస్తున్నారాయన. గతంలో తన భారీ చిత్రాల […]