వేసవికాలం వచ్చిదంటే భానుడి భగభగకు ప్రజలు చెమటలు కక్కుతూ.. పనికి వెళ్లే పని.. ఆఫీస్‌లకు వెళ్లే వాళ్లు ఆఫీసల బాట పడుతుంటారు. అయితే ఈ ఏడాది వేసవికాలం ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండాకాలం ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే.. రాబోయే రోజుల్లో ఎండతీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇళ్లలో ఉన్న పాత కూలర్లను, పనిచేయని ఏసీలను బయటకు తీసి రిపేర్లు చేయించుకొని రాబోయే ఎండాకాలనికి ప్రజలు సిద్ధమవుతున్నారు.
తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంది. నిర్మల్ జిల్లా లింగాపూ ర్ లో 42.4 డిగ్రీలు గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, తరువాత తానూర్ లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. నిజామాబాద్ జిల్లాలోని సిర్కొండలో 41.2 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.