Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy Made Comments on Union Minister Kishan Reddy.
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రచ్చ జరుగుతోంది. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ బీజేపీ నేతలు ఓ మాటల మాట్లాడుతుంటే.. కేంద్రమంత్రులు మరోలా మాట్లాడుతున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై ఇటీవల తెలంగాణ మంత్రుల బృందం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంల నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ చేయాలన్న డిమాండ్ తో ఉగాది తర్వాత ఉధృతమైన స్థాయిలో టీఆర్ఎస్ ఉద్యమం ఉంటుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రైతులకు కూడా కేంద్రం క్షమాపణ చెప్పే రోజులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా మేం వరిపంట వేయవద్దని రైతులకు సూచిస్తే.. బీజేపీ నేతలే రైతులతో వరిపంట వేయించారన్నారు. కేంద్రంతో కొనిపించే బాధ్యత నాదని బండి సంజయ్ చెప్పారని, యాసంగి పంట కొనవరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోందని, ప్రతి గింజ కొంటామని చెబుతూనే రారైస్ కావాలంటున్నారన్నారు. తెలంగాణపై బీజేపీ నేతలకు అక్కసు ఎందుకని, తెలంగాణను అవమానించినవారు చరిత్రలో కలిసిపోయారన్నారు. కిషన్‌రెడ్డి చచ్చేవరకు కేంద్రమంత్రిగా ఉంటారా, వడ్లు కొనాలని కిషన్‌రెడ్డి ఎందుకు చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. ఇన్నిసార్లు ఢిల్లీకి మేం వెళ్తే మాతో కలిసి కిషన్‌రెడ్డి ఎందుకు పీయూష్‌గోయల్‌ను కలవలేదని ఆయన ప్రశ్నించారు.