నేడు సినిమా టికెట్ల ధరల విషయమై చిరంజీవి టీం సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఐదో షోను తీసుకురావాలని అడిగారని, సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం, ఆ తర్వాత వారం ఆడగలిగితే సూపర్‌హిట్ అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ పాయింట్ అర్ధం చేసుకున్నామని, అదే సమయంలో అది అందరికీ వర్తిస్తుందని, చిన్న సినిమాలకు అవే రేట్లు వర్తిస్తాయని ఆయన తెలిపారు. వారిక్కూడా మంచి ఆదాయాలు వస్తాయని, ఐదో ఆట […]
హైదరాబాద్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా.. ఈ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఓ బుక్‌లెట్‌ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది కాలంలో నగర అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్టు ఆమె తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో భాగంగా 65 వేల ఇండ్లను పూర్తి చేశామన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా అనేక ఫ్లై ఓవర్లు నిర్మించామని, సీఆర్ఎంపీ కింద […]
సినిమా టికెట్ల ధరలపై నేడు సీఎం జగన్‌తో చిరంజీవి టీం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీలో షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం కొంత పర్సెంటేజ్ కేటాయించామని ఆయన తెలిపారు. ఏపీలో సినిమా షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం… ఇక్కడ షూటింగ్‌లు జరిపి ఉండాలి అన్న నిబంధనను తీసుకురాగలిగితే ఇక్కడ కూడా షూటింగ్‌లు పెరుగుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కనీసం ఎంత శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి […]
ఏపీ సినిమా టికెట్ల ధరల విషయంపై చిరంజీవి బృందంతో సీఎం జగన్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ… దీనిపై ఒక కమిటీని కూడా నియమించామని ఆయన వెల్లడించారు. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన […]
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఇండియా (సీసీఐ) యూనిట్లో మూతపడ్డ యూనిట్‌ను త్వరగా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌లోని మూతపడిన యూనిట్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారి 44పై గురువారం నిర్వహించిన రాస్తారోకోలో ఆయన పాల్గొన్నారు. యూనిట్ పునఃప్రారంభం కోసం పోరాడేందుకు ఏర్పాటైన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో సీసీఐని పునఃప్రారంభించేందుకు కృషి చేస్తానని చెప్పిన ఆదిలాబాద్ ఎంపీ […]
దేశంలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. గత నెల కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అరుదైన ఫీవర్ కేసు బయటపడింది. తీర్థహళ్లి మండలంలో ఓ మహిళకు(57) మంకీ ఫీవర్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. అయితే ఇప్పుడు తాజాగా కేరళలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కేరళ వయనాడ్ జిల్లాలోని పనవళ్లీ గిరిజన ప్రాంతంలో 24 ఏళ్ల యువకుడికి ఈ జ్వరం సోకింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఆ యువకుడికి మంకీ ఫీవర్ లక్షణాలు ఉండగా.. […]
హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ఎఐసీ (ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్) ప్రతిష్టాత్మకమైన ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపును వరుసగా రెండోసారి అందుకుంది. 2021 సంవత్సరంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రయాణికుల అవసరాలను అర్థం చేసుకోవడానికి, వారి ఆందోళనలను పరిష్కరించడానికి వారి ప్రయాణీకుల మాటలు వినడానికి, నిమగ్నమై మరియు అభిప్రాయాన్ని సేకరించడానికి వారి నిరంతర ప్రయత్నాలకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం డిజిటల్ […]
వైసీపీ నేత యాక్టర్ అలీకి సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే యాక్టర్ అలీకి రాజ్యసభ స్థానం కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అలీతో మరోవారంలో కలుద్దామని సీఎం జగన్ అన్నారు. త్వరలో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 4 స్థానాల్లో ఒక స్థానం మైనార్టీకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ మైనార్టీ స్థానం ఇప్పుడు అలీని వరించనున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ […]
ఏపీ ప్రభుత్వ సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని సెంట్రల్ ఈఆర్సీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అధిక ధరలకు సెకీ ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, టెండర్ల పై సెంట్రల్ ఈఆర్సీకి పయ్యావుల ఫిర్యాదు చేశారు. అధిక రేటుకు విద్యుత్ కోనుగోళ్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నష్టం పోతుందని, ఇవాళ జరిగిన సెంట్రల్ ఎలక్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్ విచారణలో పయ్యావుల కేశవ అభ్యంతరాలపై […]
శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి ప్రాజెక్ట్‌ల పునరావాసంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంశధార ఆర్ఆర్కాలనీలో స్థలాల కేటాయింపులో చాలా దురాక్రమణలు జరిగాయని ఆయన అన్నారు. ప్రాజెక్ట్‌లో ముంపుకు గురైన ప్రాంతవాసులు గతంలో డబ్బులు తీసుకొని మళ్లీ భూములు కావాలనటం సరికాదని ఆయన వెల్లడించారు. అర్హులు, నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రజాప్రతినిధులు అక్రమణలు చేసి, పట్టాలు అమ్ముకోవడం చేస్తున్నారని, ఎక్వైరీ వెయ్యమని […]