కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ట్విట్టర్ వేదిక విమర్శనాస్త్రాలు సంధించారు నిజమాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కల్వకుంట్ల కవితకు కౌంటర్‌ను ఇస్తూ.. పోస్టులు పెడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘చెల్లా.. కల్వకుంట్ల కవిత.. 2014లో ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకుంటామని చెప్పి మొత్తానికి మొత్తంగా మూసేసి రైతులకు, కార్మికులకు పంగనామాలు పెడ్తివి.. పసుపు బోర్డు తెస్తా.. ఫ్యాక్టరీ ప్రభుత్వం పరం చేస్తానన్న నమూనాలోనే మీ ఎంపీలు ధర్నా డ్రామాల్జేస్తున్నారు.. చెల్లా…’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా ‘కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఎన్నడూ కొనుగోలు సమస్య రాలేదు.. మన పోరుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లో లేని సమస్య తెలంగాణలో ఎందుకు ఉంది..’ అని ఆయన ప్రశ్నించారు. కల్వకుంట్ల కల్ల మాటలు కట్టిపెట్టి.. కల్లాల్లో ధాన్యం గింజలపై ప్రాణాలు వదిలేస్తున్న పేద రైతుల ప్రాణాలు కాపాడు అంటూ ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.