ధరణి పోర్టల్‌లోని లోపాలపై కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిందని, కానీ కాంగ్రెస్ సూచనలను, సలహాలను కేసీఆర్ పట్టించుకోలేదని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణిలో లోపాలను సరిచేసేందుకు హరీష్ రావు కమిటీ కేవలం కంటి తుడుపు చర్యనేనని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు ఎవ్వరితోనూ పూర్తిస్థాయిలో చర్చలు జరపలేదని, గ్రామాల్లో తర తరాలుగా వ్యవసాయం చేసుకునే రైతుల హక్కులను ధరణితో భంగం కలిగిందని ఆయన మండిపడ్డారు. […]
బీజేపీ సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకుంటోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనీ.. అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి పథకం, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు కింది స్థాయి వరకు చేరేలా ప్రయత్నం చేయాలని కార్యకర్తలకు సూచించారు. లేకుంటే ప్రతి పక్షాలు చేసే అబద్దాలే నిజమని నమ్మే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి.. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు […]
నీళ్లు, నిధులకెడ్చిన తెలంగాణ కోసం పట్టుదలతో ముందుకొచ్చిన నేత కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో కేసీఆర్ తెలంగాణ సాధించారని ఆమె అన్నారు. సత్యం చెప్పి ఉద్యమం చేశారు.. నిజం చెబుతూనే రాష్ట్ర అభివృద్ధి చేశారని ఆమె తెలిపారు. ఏం చేస్తామో అదే చెప్పడం కేసీఆర్ నైజమని ఆమె పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలినప్పుడు.. మనం చేసిన అభివృద్ధి పనులను చెప్పి సమాధానం ఇవ్వాలని […]
తెలంగాణాకే తలమానికమైన మేడారం సమ్మక్క-సార్క జాతర ఈ ఏడాది వైభవోపేతంగా జరిగింది. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం జాతర కన్నుల పండువగా సాగింది. అయితే మేడారం జాతర హుండీల లెక్కింపును బుధవారం ప్రారంభించారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు […]
తొగుట మండలం తుక్కాపూర్‌లో బుధవారం మల్లన్న సాగర్ ప్రాజెక్టు పంపుసెట్లను స్విచాన్ చేసి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. అనంతరం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించి గోదావరి జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ మల్లన్న సాగర్‌ను పూర్తి చేసిన అనంతరం కొమురవెల్లి ఆలయ పీఠాధిపతికి అభిషేకం నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తన వాగ్దానాన్ని విమోచించడానికి, చంద్రశేఖర్ రావు అభిషేకం చేయడానికి మల్లన్న సాగర్ నుండి […]
ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న ఘర్షణ వైఖరి రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతోంది. సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని తరలించింది రష్యా. రెండు లక్షల మందికి పైగా సైన్యాన్ని చేరవేసింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి అగ్రరాజ్యం అమెరికా చేస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదు. ఈ నేపథ్యంలో కైవ్‌లోని తన రాయబార కార్యాలయాన్ని రష్యా ఖాళీ చేయడం ప్రారంభించింది. బుధవారం మధ్యాహ్నం నాటికి, […]
కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ లో ఏ మాత్రం కొత్తదనం ఉన్నా నటీనటుల గురించిన ఆలోచన చేయకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే నూతన నటీనటులు వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. అలాంటి చిత్రమే ‘కిరోసిన్’. గతంలో తెరపై రాని ఓ సరికొత్త క్రైమ్ థిల్లర్ కథను తయారు చేసుకున్న ధృవ తానే స్క్రీన్ ప్లే, మాటలు రాసుకుని ప్రధాన పాత్రనూ ఇందులో పోషించారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ […]
నిజామాబాద్ మార్కెట్లో ఈ రోజు పసుపు పంటకు క్వింటాల్ కు 10 వేల రూపాయలు ధర పలికిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పడ్డ అకాల, అతి వర్షాలకు పసుపు పంట చాలా వరకు దెబ్బతిన్నదని ఆయన అన్నారు. పంట కుళ్లి పోయిన రైతులు చాలా వరకూ నష్టపోయారని, అలాంటి పంట తక్కువ ధర పలుకుతుందని, అలాంటి రైతులను ఆదుకోవాలని ఇప్పటికే నేను ముఖ్యమంత్రి కి లేఖ రాయడం […]
తెలంగాణా ప్రభుత్వ నిర్లక్ష్యం, కావలసిన నిధులు మంజూరు చేయకపోవడంతో బహుళ మోడల్ రవాణా వ్యవస్థ (Multi Model Transport System) రెండవ దశ పనులు నిలిచి పోయాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ పనులు త్వరిగతినా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈరోజు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. రెండవ దశలో రైళ్లు రాయగిరి (భువనగిరి జిల్లా) వరకు పొడిగించుటకుకేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారుచేసి, రాష్ట్ర ప్రభుత్వం […]
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించుటకై తక్షణమే నోటిఫికేషన్స్ వేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI)అధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు ఈ నెల 25న జరిగే ధర్నాకు నిరుద్యోగ యువత హాజరై జయప్రదం చేయాలని డీవైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్‌లు పిలుపునిచ్చారు. బుధవారం డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్స్ వేయకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కాలాయాపన చేస్తుండడంతో […]