ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా మరో రసవత్తర పోరు జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడనుంది. అయితే టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా నాలుగు ఘోర పరాజయాలతో చవిచూసిన సీఎస్‌కే జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అయితే ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన సీఎస్‌కే భారీ స్కోరు ఆర్‌సీబీ ముందుంచింది. రాబిన్ ఊతప్ప విధ్వంకర ఇన్నింగ్స్ ఆడాడు. 23 పరుగుల తేడాతో విజయం సాధించి ఎట్టకేలకు సీఎస్‌కే ఖాతా తెరిచింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్ 41, దినేశ్ కార్తిక్ 34, ప్రభుదేశాయ్ 34 పరుగులు చేశారు. సీఎస్‌కే బౌలర్లలో తీక్షణ 4, జడేజా 3, డ్వేన్ బ్రావో, ముఖేశ్ చౌదరీ చెరొక వికెట్ తీశారు.