టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. మాజీమంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకులు యడ్లపాటి వెంకట్రావు (102) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. 1967లో గుంటూరు జిల్లా వేమూరి నుంచి యడ్లపాటి వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్‌లో చేరిన యడ్లపాటి.. వేమూరి నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978-80 మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. 1983లో టీడీపీలో చేరిన యడ్లపాటి వెంకట్రావు.. 1995లో గుంటూరు జడ్పీచైర్మన్‌గా […]
నేడు ఏపీలో జగనన్న తోడు పథకం కింద వడ్డీలేని రుణాలు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో రుణాలను జమచేయనున్నారు. నేడు చెన్నైలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ పుస్తకాన్ని రాహుల్‌గాంధీ అవిష్కరించనున్నారు. అంతేకాకుండా శరద్‌పవార్, స్టాలిన్‌లతో రాహుల్‌గాంధీ భేటీ కానున్నారు. నేడు తొలివిడత మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 5 రెండవ విడత ఎన్నికలు జరుగనున్నాయి. రెండు విడతల్లో 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. […]
మేషం :- వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థకు గురవుతారు. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభం :- ప్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. సోదరులతో అవగాహన లోపిస్తుంది. పుణ్య, సేవా కార్యక్రమాలలో […]
నిటారైన విగ్రహం, నటనలో నిగ్రహం, వాచకంలో వైవిధ్యం వెరసి ముక్కామల కృష్ణమూర్తిని విలక్షణ నటునిగా నిలిపాయి. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ముక్కామల. హీరోగా, విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా మెప్పించారాయన. తెలుగువారి హృదయాల్లో చెక్కుచెదరని స్థానం సంపాదించారు ముక్కామల. ముక్కామల కృష్ణమూర్తి 1920 ఫిబ్రవరి 28న గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ ముక్కామల సుబ్బారావు, తల్లి సీతారావమ్మ. ముక్కామల కన్నవారికి కళలంటే […]
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘నుమాయిష్’ పునఃప్రారంభమైనప్పటి నుండి దాదాపు 40,000 మంది ఈ స్థలాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. సాధారణంగా జనవరిలో నిర్వహించే ఈవెంట్ ఓమిక్రాన్ కారణంగా కోవిడ్ కేసుల వేగవంతమైన పెరుగుదల దృష్ట్యా గత నెలలో నిలిపివేయబడింది. అంతేకాకుండా గత సంవత్సరం, కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా సొసైటీ దీనిని నిర్వహించనందున నగరం నుమాయిష్‌కు మిస్ అయ్యింది. అయితే శుక్రవారం తిరిగి ప్రారంభమైనప్పటి నుండి, ఎగ్జిబిషన్ గ్రౌండ్ మెగా వార్షిక ఫెయిర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కుటుంబాలతో […]
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గడం లేదు. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. అయితే ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో తెలంగాణలో 18,881 […]
రష్యా సైనిక దాడితో ఉక్రెయిన్ అట్టుడికిపోతోంది. ఉక్రెయిన్‌లో ఇతర దేశాలకు చెందిన పౌరులతో పాటు, ఉక్రెయిన్ పౌరులు కూడా తమ ప్రాణాలను గుప్పింట్లో పెట్టకొని గడుపుతున్నారు. అయితే నాటో దేశాలు దూకుడు ప్రదర్శిస్తుండడం, స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించడం, కఠినమవుతున్న ఆర్థికాంక్షలు, తమ విమానాలకు గగనతల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాటో దేశాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న పుతిన్ […]
గత వారం కర్మన్‌ఘాట్‌లో మత కలహాల సందర్భంగా పోలీసు సిబ్బందిపై దాడి చేసినందుకు ఆరుగురిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో గౌలిపురానికి చెందిన వ్యాపారి శివ చంద్ర గిరి (35), మీర్‌పేటకు చెందిన వ్యాపారి వర్ప లలిత్ చౌదరి (22), డిగ్రీ విద్యార్థి గొడవల శృతిక్ రెడ్డి (19), డిగ్రీ చదివిన మేడి అంకిత్ (20) ఉన్నారు. విద్యార్థి, అల్మాస్గూడ నివాసి, మేనేజ్మెంట్ కోర్సును అభ్యసిస్తున్న పి రాజ్ స్వీకృత్ రెడ్డి (19) బాలాపూర్‌లో […]
ఉక్రెయిన్ లో తెలుగు బిడ్డలు చిక్కుకుంటే కనీసం సమీక్ష నిర్వహించలేదు.. ఒక్క విద్యార్తి తో అయినా మాట్లాడారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇవ్వాళ వెళ్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతాలు పలుకుతున్నారు.. సిగ్గుండాలి వాళ్లకు అని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ను గజగజ వణికిస్తున్న పార్టీ బీజేపీ అని, నువ్వేం చేయలేవు.. నీతో ఏమి కాదు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. మూర్ఖుడు, అతడి కుటుంబం తెలంగాణను ఏలుతోందని, శ్రీకాంత చారి, ఉద్యమకారుల […]
ఇందిరా పార్క్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 37వ ‘హునార్ హాత్’లో 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు నుండి 700 మందికి పైగా కళాకారులు మరియు హస్తకళాకారులు గొప్ప సంప్రదాయ సమర్పణలతో పాల్గొంటున్నారు. మార్చి 6 వరకు జరిగే ఈ ఎక్స్పో కళాకారులు, హస్తకళాకారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడేళ్లలో ఈ ఈవెంట్లు దాదాపు 8 లక్షల మంది కళాకారులు మరియు కళాకారులకు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం కల్పించాయని నిర్వాహకులు […]