పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రమాణ స్వీకారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని, ప్రతి కార్యకర్త ఈ పార్టీలో ఉన్నందుకు గర్వపడాలని ఆయన అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు ఆ రాష్ట్ర నాయకులు సంక్షేమ ఫలాలు అందించడంలో ఏ ఒక్క రాష్ట్రం సక్సెస్ కాలేదన్నారు. మన తెలంగాణ రాష్ట్రం ప్రజలు కోరుకున్న దానికంటే ఎక్కువే […]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేయాలంటూ గాంధీభవన్‌లో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యోగం పోయేవరకు కొట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే 12 నెలల్లో సోనియమ్మ రాజ్యం రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరం లోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయించే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ని […]
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలంటూ.. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. 42 మంది ఎమ్మెల్యే లతో తెలంగాణ కోసం లేఖ రాసింది తెలంగాణ కాంగ్రెస్ నేతలేనని ఆయన అన్నారు. కోట్లాడిన వాళ్ళకే బీ ఫామ్ అని, కోటా లేదు..వాటా లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు. కొట్లాటలో ఉన్నోళ్లకే టికెట్లు.. ఇంటికి తెచ్చి ఇస్తానని ఆయన అన్నారు. కొత్తగా వచ్చిన రాష్ట్రం […]
సీఎం కేసీఆర్ ఎంతో సదుద్దేశంతో ప్రారంభించిన టీఎస్ బీపాస్ గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టీఎస్ బీపాస్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలు కోసం పట్టణాలు, పంచాయితీలు, స్ధానిక సంస్థల పరిధిలో జనన, మరణాలను ఖచ్చితంగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనన, మరణాలను వందశాతం నమోదు […]
Live : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరసన దీక్ష.. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
నా రాజకీయ జీవితం ప్రారంభం అయ్యిందే యూత్ కాంగ్రెస్ తో అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ కోటాలో మంత్రిని అయ్యాయని, నాదేమి పెద్ద కుటుంబం కాదన ఆయన అన్నారు. పని చేస్తే ఎమ్మెల్యే లు..మంత్రులు అవుతారని, కష్టపడి పని చేయండి.. రాహుల్ గాంధీ టికెట్స్ కూడా ఇస్తారని ఆయన వెల్లడించారు. ఖాళీ లు వెంటనే పూర్తి చేయాలని, నిరుద్యోగులు రోడ్ల మీదకు రావాలన్నారు. అందరితో కలిసి […]
తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వ్యక్తిగత విమర్శలు మానుకో అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎంపీ రంజిత్ రెడ్డి హెచ్చరించారు. చాతనైతే ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం పార్లమెంట్లో మాతో పాటు కొట్లాడు అని ఆయన అన్నారు. వరి కొనుగోలు కోసం కేంద్రంతో […]
ఎంతో మంది కళాకారులు నైపుణ్యంతో వస్తువులు తయారు చేస్తున్నారని, కళాకారులకు ప్రోత్సాహం అవసరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు హస్త కళలను ప్రోత్సహించాలని, మార్చి 6వ తేదీ వరకు హునర్ హాట్ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. మేకిన్ ఇండియా మేడిన్ ఇండియాలో భాగంగా ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన వెల్లడించారు. ఏ దేశానికి మనం తక్కువ కాదు, గొప్ప వారసత్వం మనదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చాలా విదేశాలకు వెళ్ళినప్పుడు […]
పరిగిలో రేవంత్ రెడ్డి పిచ్చిలేసినట్టు మాట్లాడాడు.. రేవంత్ రెడ్డి ఒక కమెడియన్ అంటూ ప్రభుత్వం విప్ బాల్క సుమన్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రేవంత్ లో విషం తప్పా …విషయం లేదని, రైతు ఆత్మహత్యలు ఎక్కువగా కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ చంద్రబాబు చెప్పులు మోసారు అని ఆయన విమర్శించారు.. రేవంత్ రెడ్డి జోకర్ లెక్క మాట్లాడుతున్నాడు…ఒక ట్యూటర్ ను పెట్టుకోవచ్చు కదా అని […]
కాంగ్రెస్ లో నాటకాలు, డ్రామాలు కుదరవు అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తలు సరిగా ఉన్నా, నేతల మద్య సమన్వయం లేదన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోమని, కేసీఆర్ తెలంగాణలో లూటీ ముగియడంతో … బంగారు భారతదేశం అంటూ దేశంలో లూటీకి కోసం వస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు పై బీజేపి డ్రామాలాడుతోందని, పార్లమెంట్‌కు తాళం వేసి తెలంగాణ […]