కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పన్నుల రూపేనా ఈ ఏడేళ్ల కాలంలో తెలంగాణలో 7 లక్షల కోట్లను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తోడు దొంగల్ల దోసుకున్నాయని ఆయన ఆరోపించారు. 2014కు ముందు ఉన్న ధరలే ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ పన్నుల రూపేనా లీటరు 50 పెంచారని, వంట గ్యాస్ 500 పెంచి ప్రజల నుంచి దోసుకుంటున్నారని విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో రావటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఆయనను వ్యూహకర్తగా భావించటంలేదన్నారు. ఒక నాయకుడిగానే చూస్తున్నామని, కాంగ్రెస్‌పై నమ్మకంతో ఆయన పార్టీలో చేరుతాడన్నారు.