మెగా అభిమానులకు భోళాశంకర్ చిత్రయూనిట్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ సినిమా నుంచి అప్డేట్ విడుదల చేసింది. చిరంజీవి కథానాయకుడిగా తమన్నా కథానాయికగా.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా ‘వైబ్ ఆఫ్ భోళా’ పేరుతో చిత్ర యూనిట్ ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. చిరంజీవి నుంచి ఈ మూవీలో కొత్తలుక్‌లో ఫుల్ జోష్‌తో […]
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రెండో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో మొత్తంగా 250 మంది విద్యార్థులున్నారు. శనివారం 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్ఇండియా విమానం ముంబైకి చేరుకుంది. ఇలా విమానాశ్రయానికి చేరుకుంటున్న విద్యార్థులకు వారి ఊర్లకు వెళ్లేందుకు టీఎస్ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థుల […]
వ్యాపారం చేసినవారితో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఇలా ప్రతి ఒక్కరికీ బ్యాంకుతో సంబంధం ఉంటుంది. ఏమైనా లావాదేవీలకు వ్యాపరస్తులు ఖచ్చితంగా బ్యాంకులు అశ్రయించాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సార్లు నెలల అధిక సెలవులు రావడంతో బ్యాంకులు రోజుల కొద్ది మూతపడుతుంటాయి. ఈ నేపథ్యంలో మార్చి నెలలో దేశవ్యాప్తంగా భారతీయ రిజర్వు బ్యాంకు 13 రోజులు సెలవులను ప్రకటించింది. కానీ ఏపీ, తెలంగాణతో మాత్రం 8 మాత్రమే మూసుకోనున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం […]
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అభిషేక ప్రియుడైన భోలాశంకరుడికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. సముద్ర స్నానాలు, నదీ స్నానాలను ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. కాళేశ్వరం ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సందడి నెలకొంది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు, ఆలయంలో స్వామి వారికి భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటలకు […]
హరహర మహాదేవ శంభోశంకర.. అంటూ స్మరిస్తే నేనున్నానంటూ.. కదిలివచ్చే భోళాశంకరుడి పారాయణం చేస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మీ ఇంటిల్లిపాదికి చేకూరుతాయి. ఈ రోజు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి. ఈ రోజు స్వామి వారిని స్మరిస్తూ ఈ స్తోత్ర పారాయణం చేయండి.
శ్రీకాకుళం జిల్లానీటి యాజమాన్య భవనాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సినీ ఇండస్ర్తీ మీద చంద్రబాబు, లోకేష్ ఎప్పుడూ లేనివిధంగా ట్విట్స్ చేస్తున్నారని ఆయన అన్నారు. సినిమాలను రాజకీయాలకు ఉపయోగించుకొవాలని చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ప్రేమున్నట్లు మాటాడుతున్నారన్నారు. ఎన్టీఆర్ వారసుడు టీడీపీ కోసం ఎంతో శ్రమించిన జూనియర్ ఎన్టీఅర్ సినిమాకోసం ఏనాడూ చంద్రబాబు, లోకేష్ ఆలోచించలేదని మండిపడ్డారు. రాజకీయం, స్వప్రయోజనాల […]
నేడు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించే ఛాన్స్ ఉంది. అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. నేటి నుంచి ఈ నెల 30 వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీల అమలు జరుగనుంది. తెలంగాణ ఈ చలాన్ వెబ్సైట్లో చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించనున్నారు. నేడు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ ఆలయాలు దేదీప్యమానంగా విద్యుత్ కాంతుల అలంకరణతో మెరిసిపోతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని […]
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు కొత్త స్క్రిప్ట్ తయారుచేసుకుని సినిమా చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారాముల దర్శించుకున్న ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై ధ్వజం ఎత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని ఆయన విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి, అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఉద్యోగ నోటిఫికేషన్లు, రెండు పడక గదుల ఇల్లు, దళిత […]
సాక్షి పత్రికలో తనను కించపరుస్తూ కథనాలను ప్రచురించినందున 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు విశాఖకు నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. అదానీ డేటా సెంటర్ ముంబై పోయింది… ఒక్క పరిశ్రమ రాలేదు… ఏపీ పెట్టుబడులు ప్రక్క రాష్ట్రాలు లో పెడుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ వారు అంతా గాడిదలు కాస్తున్నారని, వైసీపీ వాళ్ళు ఇక్కడ డబ్బులు దోచుకోని ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారని […]
క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జగనన్న తోడు పథకం కింద వడ్డీలేని రుణాలను జమచేశారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజుకు రూ.10ల వడ్డీకూడా చెల్లించాల్సిన పరిస్థితులు చిరువ్యాపారులకు ఉండేవని, ఇవాళ రూ.510.46 కోట్ల రుణాలు ఇవ్వడమే కాకుండా, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తున్నామన్నారు. మొత్తంగా ఇవాళ రూ.526.62 కోట్లను ఇస్తున్నామని, గొప్ప వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తీసుకున్న […]