సంగారెడ్డిలో నేడు తెలంగాణ జనసమితి పార్టీ రెండవ ప్లీనరీ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ వివిధ జిల్లాల నుండి నాయకులు, కార్యకర్తలు హజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. భూమి ఇచ్చేవారి బతుకు బాగు పడాలని కోరుకుంటున్నామని, నీమ్జ్ ప్రాజెక్టు రాకూడదని రైతుల పక్షాన కోర్టుకు వెళ్ళామన్నారు. సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలపై కూడా పోరాటం చేశామని, కాళేశ్వరం ఎత్తి పోత పథకం వల్ల వేల ఎకరాల పంట భూములు మునిగి పోతున్నాయన్నారు. […]
మూడు రోజులు తెలంగాణలో తమాషా కార్యక్రమం జరగబోతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి అన్నారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే మహిళలు బతుకుతున్నారు అనే విధంగా టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్‌లో మంత్రి పదవులు అనుభవించిన సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ ను పొగడడం ఆశ్చర్యం వేసిందని ఆమె అన్నారు. ఎంపీ మాలోతు కవిత ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోయిందా.. కాంగ్రెస్ బిక్ష వల్లే కవిత రాజకీయాల్లో ఉందని ఆమె విమర్శించారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే ఆడ పిల్లలకు […]
మోదీ మేక్ ఇన్ ఇండియా ప్లాన్ వ్యర్ధమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారని బీజేపీ నేత కరుణా గోపాల్ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, నిర్మలా సీతారామన్ పై కేటీఆర్ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని, మోదీ ప్రభుత్వంపై పారిశ్రామిక వేత్తల్లో కేటీఆర్ అపోహలు సృష్టించారని విమర్శించారు. నడ్డా అడ్డా ఎర్రగడ్డ అని కేటీఆర్ వ్యాఖ్యానించడం సరైంది కాదని, పారిశ్రామిక వేత్తలకు రాజకీయ అజెండాలు ఉండవని, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ సహకారం తీసుకుని ముందుకు వెళ్తారని […]
చంద్రబాబు పోలవరం బ్యారేజీ కడదామనే భ్రమలో ఉన్నారంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సెటైర్లు వేశారు. అందుకే పోలవరం బ్యారేజీ అంటున్నారని, మేము కడుతుంది పోలవరం ప్రాజెక్టేనని ఆయన అన్నారు. అంతేకాకుండా దీనిపై ఎవరితోనైనా ఓపెన్ డిబెట్ కు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఒక్క క్యూసెక్కు నీరు చుక్క తగ్గకుండా నీరు స్టోరేజ్ చేస్తామని, చంద్రబాబు తప్పిదాలు కారణంగా డయాఫ్రం వాల్ పునఃనిర్మాణం చేయాల్సి వస్తుందన్నారు. రాజమండ్రి నగరంలో 35 కోట్ల […]
రాజధానిపై మరో చట్టం తీసుకురావటానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం రాజధానిపై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉందిగానీ శాసనసభకు లేదని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. శాసన సభ రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం చేసే అధికారం లేదని ఆయన వెల్లడించారు. రాజధానిపై మూర్ఖంగా మరో చట్టం చేసినా […]
హైదరాబాద్‌లో పలువురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా ప్రభుత్వం బదిలీ చేసింది. డీసీపీ విజయ్ కుమార్‌ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సెంట్రల్ జోన్ డీసీపీగా రాజేశ్ చంద్రకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. సౌత్ జోన్ డీసీపీగా సాయి చైతన్యను నియమించింది. ఈస్ట్ జోన్ డీసీపీగా సతీష్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అయితే సైబరాబాద్ డీసీపీ విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ […]
పోలవరం నిర్వాసితులకు అంతా బాగుందని కేంద్రమంత్రికి జగన్ చెప్పించే ప్రయత్నం చేశారని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావసం కింద ఎన్ని ఇళ్లు, ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో సీఎం ఉన్నారని, దాదాపు లక్ష కుటుంబాలకు కట్టాల్సిన ఇళ్లపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పోలవరం పరిశీలనకు వస్తే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అడ్రస్ లేడని, జరిగిన పనులు […]
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకునే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ములుగులో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీలో గిరిజనులకు ఏడున్నర శాతం సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు, 90 శాతం సీట్లు […]
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు దిశగా పయనించనుందని..దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలుల తీవ్రత పెరగి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుడం కొనసాగుతోంది. తమిళనాడులోని నాగపట్నం నుంచి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతం కావడంతో 13 కి.మీల వేగంతో ఉత్తర దిశగా వాయుగుడం కదులుతోంది. ఇది సాయంత్రం […]
ఉక్రెయిన్ పొరుగు దేశాల నుండి మరో 629 మంది భారతీయులను తీసుకువస్తున్న మూడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) విమానాలు శనివారం ఉదయం హిండన్ ఎయిర్ బేస్‌లో దిగినట్లు వైమానిక దళం తెలిపింది. రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24 నుండి ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున, యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, స్లోవేకియా మరియు పోలాండ్ నుండి భారతదేశం తన పౌరులను ఖాళీ చేయిస్తోంది. “ఇప్పటి వరకు, భారత వైమానిక దళం […]