తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చేరిగారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ తాటాకు చప్పుళ్ళకు బీజేపీ భయపడదని కిషన్ రెడ్డి అన్నారు. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని ఆయన విమర్శలు గుప్పించారు. దళితులకు వెన్నుపోటు పొడవటం, సచివాలయానికి రాకుండా పాలన చేయటమే కేసీఆర్ గుణాత్మకమైన మార్పు అన్నారు. కల్వకుంట్ల కుటుంబం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన […]
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసురించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తెలంగాణ బంగారు అయ్యిందని, ఇక దేశాన్ని బంగారు దేశంగా మర్చుతా అని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ వస్తే ప్రాజెక్టులు పూర్తి అవుతాయని, ప్రజలు అభివృద్ధి చెందుతారు అని సోనియా గాంధీ అనుకున్నారని, కానీ కేసీఆర్ ప్రజల్ని భ్రమల్లో ఉంచుతున్నారని […]
తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనంటూ ఆయన జోస్యం చెప్పారు. మైనార్టీ అభివృద్ధిని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. కలెక్టర్లుగా ఎంత మందికి అర్హత ఉంది అన్నది చూడాలని ఆయన అన్నారు. ఎస్పీలలో చాలా మందికి అర్హత లేదని ఆయన అన్నారు. అందుకు అధికారులు కేసీఆర్‌కు లాయల్‌గా ఉంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.ఐదుగురు అధికారుల చేతుల్లో 40 శాఖలున్నాయని.. అధికారుల అండతో సీఎం […]
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశమైన కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. శాసనసభ సమావేశాల నిర్వహణ, వివిధ రంగాల్లో సర్కార్ సాధించిన ప్రగతి, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల అవసరాలు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. […]
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 55 వేల కోట్లు నిధులు ఇచ్చింది ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబ్బులు డ్రా చేయాలని తపన తప్ప ప్రాజెక్టులు గురించి రాష్ట్ర ప్రభుత్వం అలోచన చేయడం లేదని ఆయన మండిపడ్డారు. రాయలసీమలో ఉండే నీటి సమస్యపై ఈ నెల 19 న రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా కడప లో బీజేపీ భారీ ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాయలసీమను రత్నాలసీమగా […]
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వార్తా పత్రికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పత్రిక లేని ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని చూడలేమని వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు సొంత పత్రికలు పెట్టుకుంటున్నాయన్నారు. కొన్ని పార్టీలు సొంత పత్రికలో సొంత బాకా ఊదుకుంటున్నాయని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఒక పత్రికలో ఉన్నది మరో పత్రికలో ఉండదని, సమాజానికి హాని చేసే పత్రికలు వద్దంటూ ఆయన హితవు పలికారు. ఇప్పుడు కొన్ని పత్రికలు సెన్సేషన్ కాదు.. సెన్స్ […]
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహామ్మారి తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో ఏపీలో కరోనా కేసులు బీభత్సంగా పెరగిపోయాయి. అయితే వెంటనే అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించి కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. దీంతో కరోనా కేసులు మళ్లీ అదుపులోకి వచ్చాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో 14,516 కరోనా పరీక్షలు నిర్వహించగా, 79 కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమ […]
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్ ఉండి. ఆ పక్కనే కూలీలు పని చేస్తున్నారు. ఈ సమయంలో వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. అయితే, వేగంగా వచ్చిన […]
కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అడుగడుగునా అడ్డంకులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం నిర్వహించారు. అయితే సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు చేదు అనుభవం ఎదురైందని, తనను అవమానించేవాడు కాంగ్రెస్‌లో ఎవడూ లేడని అన్నారు. అంతేకాకుండా మెదక్ జిల్లాకు వెళితే పీసీసీ సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ పద్ధతి తనకు నచ్చడం లేదని, ఈ […]
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని విపక్ష నేతలు ముక్తకంఠంతో అంటున్నారు. అయితే గతంలో కూడా కేసీఆర్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. మళ్లీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో తెలంగాణలో విపక్ష పాత్ర పోషించే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పలేకపోయింది. అయితే ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకమైన నాటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త జోష్‌తో ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా రేవంత్ […]