సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభానికి సిద్ధమైయ్యాయి. ఈ నెల 3వ తేదీన ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 5.18 ఎకరాల విస్తీర్ణంలో 36.27 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. రూ. 3.51 కోట్ల వ్యయంతో రోడ్లు, విద్యుత్, డ్రైనేజి, సౌకర్యాలు కల్పించామని తెలిపారు. […]
మహారాష్ట్రలోని ఆన్లైన్ పబ్జీ గేమ్ ఆడిన తర్వాత జరిగిన వివాదంలో తమ స్నేహితుడిని చంపినందుకు పోలీసులు మంగళవారం 20 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేలోని వర్తక్ నగర్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు స్నేహితులు తరచూ పబ్జీ గేమ్ ఆడుతూ, ఆ తర్వాత ఏదో ఒక సమస్యపై గొడవ పడుతుండేవారని వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సదాశివ నికమ్ తెలిపారు. సోమవారం […]
రోజురోజుకు మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల దాడులు పెరిగిపోతున్నాయి. గత కొంతకాలంగా మావోయిస్టుల తమ ఉనికి కాపాడుకోవడానికి నిత్యం దాడులు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్‌లో నిన్న రాత్రి నక్సల్స్ దుశ్చర్యకు పాల్పడ్డారు. అర్ధరాత్రి పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోత్కపల్లి క్యాంపుపై ఒక్కసారిగా మావోలు దాడి దిగారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. జవాన్ల కాల్పులలో పలువురు మావోయిస్టులు […]
అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం వెలిగిపోతోందని, విజయపథంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, దీనికి కేంద్రం విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని వెల్లడించారు. తలసరి ఆదాయం 2014 నుంచి 2021 వరకు 125 శాతం పెరిగినట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. జీఎస్డీపీ 130 శాతం పెరిగినట్లు తెలిపారు. దేశంలోనే అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి అని కేటీఆర్ హర్షం […]
ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయల కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని ఆయన […]
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఈ సినిమాలోని ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న విడుదల కాబోతోన్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని హీరో […]
ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మంగళవారం గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరులో గల గార్డెన్స్‌లోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలు వజ్రోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయకుడు మాట్లాడుతూ.. పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల ఎందరో సమర్థులను దేశానికి అందించిందని ఆయన అన్నారు. ఎంతో ముందుచూపుతో అప్పట్లో సీతారామయ్య ఈ పాఠశాలను ఏర్పాటు చేశారని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దని విద్య నిరుపయోగమని మహాత్మా గాంధీ అన్నారని, సమాజంలో రోజురోజుకూ విలువలు తగ్గుతున్నాయని అన్నారు. ప్రజల మధ్య […]
నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కేజ్రీవాల్ అపాయింట్మెంట్ ను సీఎంఓ అధికారులు అడిగారు. ఢిల్లీ నిర్మించ తలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించే ఛాన్స్ ఉంది. అయితే రేపు ఎల్లుండి బీజేపీయేతర ముఖ్య […]
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించిన డేటా ప్రకారం.. భారతదేశంలో ఒకే రోజు 6,915 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 4,29,31,045కి చేరుకుంది. అయితే యాక్టివ్ కేసులు 60 రోజుల తర్వాత లక్ష కంటే తక్కువకు పడిపోయాయి. 24 గంటల్లో 180 కొత్త మరణాలు నమోదవడంతో మరణాల సంఖ్య 5,14,023కి చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసులు 92,472కి తగ్గాయి. ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.22 శాతం ఉన్నాయి. అయితే దేశంలో రికవరీ […]
దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అత్యధిక వృద్ధి రేటును (9.2%) నమోదు చేసింది, ఇది 1,896 kwh (2018-19) నుండి 2,071 kwh (2019-20)కి పెరిగిందని తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ తెలిపింది. పెరుగుతున్న విద్యుత్ వినియోగం అధిక అభివృద్ధి మరియు మానవ సంక్షేమ సూచికలతో పరస్పర సంబంధం కలిగి ఉంది. రాష్ట్రంలో 1.65 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 72.8 శాతం గృహ కనెక్షన్లు, 15.4 శాతం వ్యవసాయ, 11.6 శాతం పారిశ్రామిక […]