మనిషి జీవించడానికి వారంలో ఐదు నుండి ఆరు రోజులు కష్టపడతాడు. ఇక వారంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అసలు ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందా అనే విషయం మీరు ఎవరైనా గమనించారా? మరి ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందో అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అసలు ఆదివారం సెలవు ఎందుకు వచ్చింది అని అడిగితే ప్రశ్నకు సమాధానం చాలా మంది వరకు తెలియదు. ఆదివారం సెలవు ఎలా వచ్చింది? ఆదివారానికి ఉన్న ప్రత్యేకతను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని మతాలవారు ప్రతి రోజుకి ఒక విశిష్టతను పొందుపరుచుకుంటారు.
వాటిల్లో హిందూ సంప్రదాయాలు ప్రకారం అయితే ఆదివారాన్ని రవి వారం అని కూడా పిలుస్తారు. ఆదివారానికి అధిపతి సూర్యుడు అని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల సూర్య భగవానుని మరొక పేరు అయినా రవిని తీసుకొని రవి వారంగా పిలుస్తున్నారు. సూర్యుని ప్రత్యక్ష దైవంగా కొలిచే మన హిందు సాంప్రదాయంలో ఆయన అనుగ్రహం పొందడానికి ప్రత్యేక పూజలు, ఉపవాసాలు వంటివి చేసేవారు. అలాగే క్రైస్తవులకు పవిత్ర గ్రంథం అయిన బైబిల్ లో కూడా ఆదివారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రైస్తవ మతానికి మూల పురుషుడు అయిన ఏసుక్రీస్తు చనిపోయిన మూడో రోజు సమాధిలో నుంచి తిరిగి బ్రతికాడని బైబిల్ చెప్తుంది. ఆయన్ని సమాధిలో పాతి పెట్టింది శుక్రవారం. అయితే అతను మూడవ రోజు ఆదివారం ఆకాశంలో మేఘాలలో కనిపించాడు.
దాని కారణంగా ఆదివారాన్ని పవిత్రమైన దినంగా భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే సండేను నే ఈస్టర్ సండేగా పిలుచుకుంటారు. ఈ విధంగా ఆదివారం క్రైస్తవ మతంలో కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే దళితుల అందరు ప్రతి రోజు పనికి వెళ్ళడం వలన, కుటుంబం పట్ల, దైవారాధన పట్ల శ్రద్ధ వహించడం లేదని భావించిన క్రైస్తవ ధర్మం యొక్క పెద్దలు వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలని భావించారు. రోజు అందరూ తమ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి దైవారాధన చేస్తూ సంతోషంగా గడపాలని ఎంతో శ్రేష్టమైన ఆదివారాన్ని సెలవు రోజుగా ప్రకటించారు. తర్వాత కాలంలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందిన ప్రతి దేశం ఆదివారం సెలవు అనే పద్ధతి ఆచారంగా కొనసాగించ బడింది. మన దేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడానికి ముందు ఆదివారాన్ని ఒక పవిత్రమైన రోజుగా భారతీయులు కొలిచే వారు.
కానీ సెలవు మాత్రం ఉండేది కాదు. దీనికి ప్రధాన కారణం పూర్వం మనదేశంలో వ్యవసాయం చేసేవారు ఎక్కువగా ఉండేవారు. కానీ బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించిన తరువాత మన దేశంలో వారు చేసే కార్యకలాపాలకు మన భారతీయులను కూలీలుగా తీసుకోవడం మొదలుపెట్టారు. రోజుకు ఎంతో కొంత ధనం రావడం వల్ల చాలా మంది ప్రజలు ప్రతిరోజు బ్రిటిష్ వారి వద్దకు వెళ్లి పని చేసే వాళ్ళు క్రమంలో సంఘంలో జరిగే సమస్యలు పరిష్కరించ డానికి ఎవరు సరిగ్గా సమయాన్ని కేటాయించేవారు కాదు.
అప్పటి మన సంఘంలో సమస్యలు పరిష్కరించ డానికి ఒకరోజు అందరికీ సెలవు ఉండాలని నిర్ణయించుకున్న ఆరు రోజు ప్రజలందరూ కలిసి సంఘసంస్కరణకు పాటుపడాలని అప్పటి అభ్యుదయవాది నారాయణ ఘాజీ అనే వ్యక్తి ఆదివారం భారతదేశంలో సెలవు కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఆయన డిమాండ్‌ను చేసే సమయంలో బ్రిటిష్ వారి దేశాలలో ఆదివారం సెలవు దినంగా ప్రకటించబడింది. తర్వాత బ్రిటిష్ వారు విధానాన్ని భారత దేశంలో కూడా అమలు చేశారు. ఆ విధంగా ఆదివారం సెలవు భారతదేశానికి లభించింది.