ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. అయితే దీనిపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ ని ప్రతీ ఒక్కరికి తెలియాలని రాహుల్ గాంధీ అన్నారన్నారు. రైతు డిక్లరేషన్‌లోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుందని, రాహుల్ గాంధీ సభ తరువాత బీజేపికి భయంపట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాహుల్ […]
కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం కోనాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. అనంతరం కోనాపూర్‌లో నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా నిర్మించే స్కూల్ బిల్డింగ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం కోరుట్లపేటలో డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల కోట్లతో 2 లక్షల 70 వేల ఇండ్లను నిర్మించి ఇస్తుందని వెల్లడించారు. దేశంలో […]
బెర్త్ ఉన్న రైలు ప్రయాణం ఎంత బాగుంటుందో… బెర్త్ లేకుండా చేసే ప్రయాణం అంతే ఇబ్బందిగా ఉంటుంది. అయితే రైలులో బెర్త్ దొరికినా.. బాలింతలు చట్టిబిడ్డలతో అవస్థలు పడుతుంటారు. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లల కోసం రైల్వే శాఖ సీటును ప్రత్యేకంగా రూపొందించింది. ప్రయాణ సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను రైల్వే శాఖ దృష్టిలో పెట్టుకొని రైలులో ప్రత్యేక […]
మహబూబాబాద్‌లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే మెడికల్ కళాశాలను, నూతన హాస్పిటల్‌కు నిర్మాణం చేపట్టడం జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెల్లడించారు. మంగళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే.. హరీష్‌రావు వెంట మంత్రి ఎర్రబెల్లి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాళేశ్వరం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం […]
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోట సత్తా చాటిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ప్రాంతంపై ప్రత్యేక ప్రేమ అని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాకుంటే మహబూబాబాద్ జిల్లాయే లేదని, మెడికల్ […]
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఆదివారం చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నడ్డా…కాంగ్రెస్ రాహుల్ గాంధీ మిడతల దండులా తెలంగాణ మీద పడ్డరంటూ విమర్శలు చేశారు. పచ్చబడుతున్న తెలంగాణను ఆగం చేయాలనుకుంటున్నారా.. అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడి సంక్షేమ పథకాలు ఎందుకు లేవు..? అని ఆయన ప్రశ్నించారు. కరెంట్ ఇస్తలేరని బీహార్‌లో రైతులు ట్రాన్స్ఫార్మర్ తగులబెట్టారు అని, దేశ చరిత్రలోనే […]
ఖమ్మం జిల్లా వేంసూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ధాన్యం తడవకుండా పట్టాను కప్పుతున్న సమయంలో పిడుగు పాటుకు గురై 24 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తూ ఉండటంతో ఆరపోసిన ధాన్యం తడిసిపోతోందని ఆవేదన చెందిన యువ రైతు సాగర్.. ఆ ధాన్యం రాశి వద్దకు వెళ్లి పట్టాను కప్పు తున్న సమయంలో పిడుగు పడటం తో అక్కడికక్కడే మృతి చెందాడు. సాగర్ వేంసూర్ వెటర్నరీ హాస్పటల్ […]
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర ముగింపు సభను తెలంగాణ బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నెల 14న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సభకు కేంద హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నేపథ్యంలో బహరింగ సభకు భారీ జన సమీకరణతో సత్తా […]
ఈ ఏడాది యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటి వరకు 30 జిల్లాల్లో 5299 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాటికి 76,495 మంది రైతులనుంచి రూ. 1483 కోట్ల విలువ చేసే 7.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ఆయన వెల్లడించారు. […]
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గేట్ వద్ద టాటా ఏస్, లారీ ఢీ కొన్నాయి. దీంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందగా, ఎల్లారెడ్డి లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం ఆరుగురు మృత్యువాత పడ్డారు. అయితే.. మృతులు పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. […]