Fire Accident in Asian Godown At Vanasthalipuram.
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓం కార్ నగర్ లో ఉన్న ఏషియన్ గోదాంలో భారీ అగ్నప్రమాదం చోటు చేసుకుంది. అందులో నుండి పక్కనే ఉన్న ఎన్ ఇంటీరియర్ ఫర్నీచర్ గోదాంలోకి మంటలు వ్యాపించటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయ. దీంతో స్ధానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఒక ఫైర్ ఇంజన్ తో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తుండగా మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో ఫైర్ ఇంజిన్ తెప్పించారు. అయితే.. ఈ రెండు గోదాంలతో పాటు మరో గోదాంలోకి కూడా మంటలు వ్యాపిస్తుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళలో ఉన్నారు. అయితే.. ఇదిలాం ఉంటే.. మంటలార్పుతున్న సమయంలో ఓ ఫైర్ ఇంజన్‌లో నీళ్లు అయిపోయాయి.
దీంతో మరో ఫైర్ ఇంజన్‌ను తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు అధికారులు. ఈ ఘటనపై ఫర్నిచర్ మేనేజర్ మాట్లాడుతూ.. థర్మోకోల్ కంపెనీ వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే అగ్నిప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. సన్ రోక్ స్టోన్ ఊల్ ఇన్‌స్టలేషన్ ప్రొడక్ట్స్ వాళ్ళ నిర్లక్ష్యమే కారణమన్నారు. సమయానికి ఫైర్ ఇంజిన్ రాకపోవడం వల్లనే మంటలు వ్యాపించాయని షాపు నిర్వాహకులు అంటున్నారు. ప్రమాదం జరిగిన తరువాత గంట సేపటికి వచ్చిన ఫైరింజన్లు వచ్చాయని.. కోట్ల రూపాయలు నష్టపోయామంటూ కన్నీటి పర్యాంతమవుతున్నారు వ్యాపారులు.