BJP MLA Etela Rajender Made Sensational Comments On Telangana Politics.
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరందుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ క్యాంపు ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెసిడెన్సీ స్కూల్స్ మొత్తం అధ్వానంగా తయారయ్యాయని ఆయన ఆరోపించారు. ప్రతి రోజు ఎక్కడో దగ్గర విద్యార్థులు అస్వస్థతలకు గురవుతున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థులు తినే ఆహారంలో వానపాములు, బొద్దింకలు వస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లలకు డబ్బులు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తలేరని ఆయన ధ్వజమెత్తారు.
Fire Accident : ఏషియన్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయలు నష్టం
మంత్రులు స్వతంత్రంగా తిరిగి పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదని, ఫామ్ హౌస్ లేకుంటే ఢిల్లీలో ఉండే ముఖ్యమంత్రి కనీసం పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదన్నారు ఈటల. ఈ రోజు వరకు కూడా స్కూల్స్‌లో బుక్స్ కూడా ఇవ్వలేని దుస్థితి ఉందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. ఉపఎన్నికలో హుజురాబాద్‌లో ఈటల గెలువాలని చెప్పిండు రాజగోపాల్ రెడ్డి అని, హుజురాబాద్ ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే నోటితో పీకే వ్యక్తి ఈటల అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలో రావడానికి నాకు బాధ్యత అప్పాజెప్పింది హై కమాండ అని, త్వరలో ఊహకు అందనంతగా బీజేపీలో చేరికలుంటాయని ఆయన సంచలన విషయాన్ని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మ దేవుడు కూడా కాపాడ లేడని,
నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ అని.. కేసీఆర్‌ని ఓడగొట్టడమే నా జీవిత లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.